Asianet News TeluguAsianet News Telugu

ఆ బిల్లులను ఆపడంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం...: టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు

గతంలో  టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ది పనులకు నిధులు చెల్లించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. 

TDP MP Kinjarapu Rammohannaidu warning to AP Government
Author
Guntur, First Published Jan 28, 2020, 5:00 PM IST

అమరావతి: మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులతో గతంలో  టిడిపి ప్రభుత్వం అనేక అభివృద్ది పనులను చేపట్టిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కేంద్రం అందించిన నరేగా నిధులతో గతంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని... అయితే గత ప్రభుత్వ హయాంలో చేసిన  పనులకు బిల్లులు చెల్లించకుండా వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. 

టీడీపీ నాయకులు, పార్టీతో సంబంధమున్న వ్యక్తులు ఈ పనులు చేశారంటూ కావాలనే నరేగా పనులను చేపట్టిన కాంట్రాక్టర్లను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. స్వయంగా కేంద్ర మంత్రి ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. నరేగా నిధులు ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తోందన్నారు. 

read more  తన కోసం తమ్ముడు... కొడుకు కోసం నందమూరి కుటుంబం...: చంద్రబాబుపై అంబటి ఫైర్

గత ప్రభుత్వం హయాంలో పూర్తి చేసిన బిల్డింగ్ లకు తమ పార్టీ వైసీపీ రంగులు వేసుకున్నారు కానీ ఆ భవనాలను నిర్మించిన వారికి మాత్రం బిల్లులు ఇవ్వడం లేదన్నారు. కోర్టు చెప్పిన నరేగా నిధుల విడుదల చెయ్యడంలేదని... దీనిపైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 

కోర్టులంటే ముఖ్యమంత్రి జగన్ కు చుట్టపు చూపు అయ్యిందన్నారు. ముఖ్యమంత్రిని చేసినందుకు జగన్ రాష్ట్ర ప్రజలకు తన కోర్టు కేసుల ఖర్చులను కానుకగా ఇచ్చారని ఎంపీ ఎద్దేవా చేశారు.

read more  చైనా నుండి భారత్ కు కరోనా వైరస్... ఏపిలో హై అలర్డ్...: మంత్రి ఆళ్ల నాని

ముఖ్యమంత్రిలా కాకుండా జగన్ తుగ్లక్ లాగా పాలన చేస్తున్నారని విమర్శించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ప్రజలు ఇంత పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే సీఎంకి ఏమాత్రం పట్టడం లేదని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios