Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు కళ్లద్దాలు, వినికిడి యంత్రం కానుక...: బుద్దా వెంకన్న

అమరావతి ప్రజలు రాజధాని కోసం చేపట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసుల చేత అణచివేయడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వ పతనం తప్పదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.  

TDP MLC Budda Vennkanna satires on YS Jagan
Author
Vijayawada, First Published Jan 8, 2020, 6:20 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: రాజధానిని ముక్కలుచేసి ప్రజలతో  మూడుముక్కలాడ ఆడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు 22రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల మానసికస్థితిని చంపించడానికి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆక్షేపించారు. బుధవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ... రైతుల దీక్షలు, వారి ఆందోళనలను వినలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రుల దౌర్భాగ్యమన్నారు.  ఆయనకళ్లు, చెవులు పనిచేయడం లేదేమోనన్న ఆనుమానంతో కళ్లద్దాలు, వినికిడి యంత్రం కానుకగా పంపుతున్నామని వెంకన్న స్పష్టం చేశారు. 

READ MORE  చంద్రబాబుకు అదంటే కడుపుమంట... అందుకే ఈ రాజకీయ వ్యభిచారం: ధర్మశ్రీ

రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా, మహిళలని కూడా చూడకుండా పోలీస్‌ యంత్రాంగంతో ఉద్యమాలను అడ్డుకోవాలని చూడటం ప్రభుత్వానికి తగదన్నారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ గతంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారని... ఆనాడున్న ప్రభుత్వం ఎప్పుడూ ఎవరిపైన తప్పుడుకేసులు పెట్టించలేదన్న విషయాన్ని ఆయనే స్పష్టంచేయాలన్నారు. 

జగన్‌ ఏంచెబితే అదిచేయడం, అన్యాయంగా అరెస్ట్‌లు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం డీజీపీకి తగదన్నారు. రాష్ట్రానికి డీజీపీ జగనో సవాంగో తెలియడంలేదన్నారు. అతిముఖ్యమైన శాంతిభద్రతల అంశంతో ఆటలాడటం డీజీపీకి తగదని, తప్పుడుకేసులు పెట్టేముందు ఒకసారి ఆలోచించుకోవాలని వెంకన్న హితవుపలికారు. 

సీఎం జగన్ తానా అంటే డీజీపీ తందానా అంటున్నాడని, ఇలా ముఖ్యమంత్రి చెప్పింది చేయడం సవాంగ్‌కి తగదన్నా డు. రాజధానిలో ప్రతిపక్షనేత చంద్రబాబుపై జరిగిన దాడిని సమర్థించిన డీజీపీ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి విషయంలో ఎందుకంత అత్యుత్సాహం చూపుతున్నారని బుద్దా ప్రశ్నించారు. 

READ MORE  ఆడవాళ్ళ చాటున దాక్కుని రాజకీయాలా...: చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ సెటైర్లు

మేం తలుచుకుంటే టీడీపీవాళ్లెవరూ రోడ్లపై తిరగరని ఒక మంత్రి మాట్లాడుతున్నాడని, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల రక్షకులే తప్ప భక్షకులు కాదనే విషయాన్ని సదరు మంత్రి గ్రహించాలన్నారు. ప్రజల తరుపున పోరాడటానికే టీడీపీ నేతలుగా తామందరం రోడ్లపైకి వస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, దాన్ని అణచివేయాలని చూస్తే జగన్‌ ప్రభుత్వం పతనమవడం ఖాయమని వెంకన్న తీవ్రస్వరంతో హెచ్చరించారు. 

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నమస్కారం పెడుతూ తమ సమస్యను వినాలని ఒకరైతు వేడుకుంటుంటే, ఆయన గన్‌మెన్‌ ఆ రైతుని తోసేశాడన్నారు. రైతులు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వారిని రెచ్చగొట్టడానికి అధికార పార్టీనేతలు ప్రయత్నిస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios