విజయవాడ: గతకొంతకాలంగా వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన వైఎస్సార్‌సిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ పాలనపై విరుచుకుపడుతూ విజయసాయిరెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్రంలో లేవని చెప్పగలరా...అంటూ బుద్దా వెంకన్న ద్వజమెత్తారు.    

''@VSReddy_MP గారు! మీరు నోటికి అన్నమే తింటున్నారా? వ్యక్తిగత కారణాలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అవహేళన చేస్తారా? మీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయి అని అంటున్నారు.''

''చేతగాని నిర్ణయాలు తీసుకుని 40 మంది భవన నిర్మాణ కార్మికులను పొట్టన పెట్టుకుని ఇంత నిసిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డిగారు? భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు కాకపోతే వారికి 5 లక్షల పరిహారం ఎందుకు ప్రకటించారో చెప్పగలరా?''

''వాలంటీర్లు అంతా వైకాపా వాళ్లే అని దైర్యంగా చెప్పిన మీరు వరద వల్ల ఇసుక లేదు అని అబద్దాలెందుకు చెప్పడం? సిమెంట్ కంపెనీలతో జగన్ గారికి ఇంకా బేరం కుదరలేదు అని కుండబద్దలు కొట్టండి సాయిరెడ్డిగారు.''

read more లోకేష్ పప్పు అయితే జగన్ ముద్దపప్పా: బుద్దా వెంకన్న
 
''రైతులకు రుణమాఫీ అవసరం లేదు', 'అది సాధ్యం కాదు', 'కడుపు నిండిన రైతులకు రుణమాఫీ ఎందుకు?' అంటూ రైతులను అవహేళన చేసిన జగన్ గారి వ్యాఖ్యలు మర్చిపోయి మీరు రైతుల గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నారు. వైకాపా నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు విజయసాయి గారు.'' అంటూ సీఎం జగన్ నిర్ణయాల గురించి విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. 

గతంలో కూడా బుద్దా వెంకన్న ఈ ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై స్పందిస్తూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓ వైపు జగన్ ను  విమర్శిస్తూనే విజయసాయిపై  ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 ''మీ పార్టీ నేతల ఇసుక అక్రమాలకు గుంటూరులో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఉరి వేసుకొని చనిపోయారు తెలుసా? తెలిసుండదు లెండి.. ఎందుకంటే  మీరు బ్లాక్ ఛానెల్ తప్ప మరో ఛానెల్ చూడరు కదూ!  విషయం మీ వరకూ వచ్చి ఉండదులే!!'' అంటూ వెంకన్న ఎద్దేవా చేశారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ప్రాణత్యాగానికి పాల్పడిన భవననిర్మాణ కార్మికుడిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

read more  లోకేశ్ మగాడు...జగన్ మగాడో కాదో నువ్వే తేల్చాలి...: బుద్దా వెంకన్న ఫైర్

''ఇసుక కొరత అని పచ్చ పార్టీ, పచ్చ మీడియా హడావిడి చేస్తోందని అంటూ తెదేపా పై అవాకులు చవాకులు పేలుతున్న @VSReddy_MP గారు అసలు నోటికి అన్నమే తింటున్నరా? మీ సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలి అని లేఖ రాసారుట, ఒక్క సారి చదువుకోండి.'' అంటూ విజయసాయిరెడ్డితో పాటు తమపై విమర్శలు చేస్తున్న వైఎస్సార్‌సిపి నాయకులందరికి చురకలు అంటించారు. 

 ''పనికిమాలిన సలహాల పేరుతో రోజుకో పదవి సృష్టించి ఒక్కొక్కరికీ నెలకు లక్షల్లో జీతాలు...  ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయ్యింది అంటూనే మీ @ysjagan గారు ప్రజా ధనాన్ని సాంతం నాకేస్తున్నారు కదా @VSReddy_MP గారు!!''
 
''తనమీద ఉన్న కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లడానికి కోట్లు పోసి ప్రత్యేక విమానాలు, 25 కోట్లతో క్యాంపు ఆఫీస్ కి సోకులు, పక్క రాష్ట్రంలో ఉన్న ఇంటికి హంగులు.. మీ సాక్షి పరివారాన్ని మేపడానికి 150 కోట్లు, ఆఖరికి నాసిరకం బియ్యం పంపిణీకి నాణ్యమైన సంచుల పేరుతో మీ కంపెనీకి 750 కోట్ల ఆర్డర్...''
 
''తెలంగాణ లో టిడిపి కి 1800 ఓట్లు వచ్చాయి అని ఎద్దేవా చేస్తున్నావ్. అసలు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే దమ్ము కూడా లేని నాయకుడు @ysjagan అధినేతగా ఉన్న @YSRCParty పార్టీలో ఉండడానికి సిగ్గుగా లేదా విజయసాయిరెడ్డి గారు!!''

 ''ప్రజలు చంద్రబాబు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టే మీ మడమ తిప్పే నేత వెన్నులో వణుకు మొదలైంది @VSReddy_MP గారూ!!  విలువలు, విశ్వసనీయత అని డబ్బా కబుర్లు చెప్పారు,దేవుడు స్క్రిప్ట్ బాగా రాసాడు అని బీరాలు పలికినవారు ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేను పార్టీలో చేరమని  ప్రాధేయపడుతున్నాడు.'' అని బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డాడు.