విజయవాడ: వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డిని విమర్శిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేస్తున్న ట్వీట్ల పరంపర ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విజయసాయి రెడ్డిని శుకుని మామ అని, సీఎం జగన్ ను తుగ్లక్ అని సంబోధిస్తూ వెంకన్న ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలా  గతకొద్దిరోజులగా ఆయన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. 

అయితే ఇటీవల మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పై జగన్ అనుకూల మీడియా రాసిన ఓ కథనం వివాదంగా మారింది. లోకేశ్ కేవలం చిరుతిళ్ల కోసమే దాదాపు రూ.24 లక్షల ప్రజాధనాన్ని దుబారా చేశాడన్నది ఈ కథనం సారాంశం. దీనిపై ఇప్పటికే లోకేశ్ వివరణ ఇవ్వగా తాజాగా వెంకన్న తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలతో ఓ ట్వీట్లు చేశారు.

Read more శకుని మామా... మీ తుగ్లక్, మహామేతల మాటలు మరిచావా..?: బుద్దా వెంకన్న...

''ప్రతిపక్ష నేతగా @ysjagan ఎయిర్ పోర్ట్ లో తిన్న తిండి లోకేష్ కి అంటగడతారా? లోకేష్ మగాడిలా మీ దొంగ పత్రిక రాసిన వార్తలో ఉన్న తేదీల్లో ఎక్కడ ఉన్నాడో ఆధారాలు బయటపెట్టాడు. మీ వాడు మగాడో కాదో నువ్వే తేల్చుకో.''
 
''@VSReddy_MP గారు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా తిని అది అరగక చిప్పకూడు తిన్న నువ్వు, మీ తుగ్లక్ ముఖ్యమంత్రా లోకేష్ గురించి మాట్లాడేది? నీది మనిషి పుట్టుక అయితే మీ దొంగ పత్రిక రాసిన వార్తకి ఆధారాలు చూపించు.'' అంటూ సీఎం జగన్, ఎంపీ  విజయసాయి రెడ్డిపై వెంకన్న ద్వజమెత్తారు.

Read more దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే అది మీరే...: విజయసాయిపై బుద్దా ఫైర్...

గతకొద్దిరోజులగా బుద్దా వెంకన్న వరుస ట్వీట్లతో అధికార పార్టీ పాలనను ప్రశ్నిస్తూ సీఎంపై  విమర్శలు గుప్పిస్తున్నాడు. ''దరిద్రానికి ప్యాంటు,షర్టు వేస్తే మీలా ఉంటుంది @VSReddy_MP గారు. ఇక మీ తుగ్లక్ ముఖ్యమంత్రి @ysjagan దరిద్రానికి బ్రాండ్ అంబాసిడరని కొత్తగా చెప్పక్కర్లేదు. అడుగుపెట్టాకా రాష్ట్రానికి అన్నీ అపశకునాలేగా వీసా రెడ్డిగారు. బోట్ ముంచి 56 మంది అమాయకులని మింగేసారు, 256 రైతుల్ని మింగేసారు.''

''విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారం చేసారు.  30 లక్షలమంది భవననిర్మాణ కార్మికులని రోడ్లపై నిలబెట్టారు. డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు, అన్నక్యాంటీన్ మూసేసి పేద వాడి పొట్ట కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ డిఎన్ఏలో ఉన్న దరిద్రానికి ఫుల్ స్టాప్ పడదు సాయి రెడ్డి గారు!!''  

''@VSReddy_MP గారూ, మీవాడు ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాడన్నావ్. కానీ మీవాడు రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యాడు. నీకు దమ్ముంటే తుగ్లక్ ముఖ్యమంత్రి @ysjaganతో రాజీనామా చేయించి రాష్ట్రంలో ఎక్కడనుంచైనా పోటీ చేయించు, తేలిపోతుంది ప్రజలు ఎవరిని తిరిగి కోరుకుంటున్నారో!!'' అని వెంకన్న విరుచుకుపడ్డారు.