విజయవాడ:  ఆంధ్ర ప్రదేశ్ లో ఎమర్జెన్సీని తలపించేలాగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన వుందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మంగళవారం జరుగబోయే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భారీ ర్యాలీగా ప్రజలతో కలిసి వెళుతున్నట్లు ప్రకటించారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ వెంకన్న సవాల్ విసిరారు. 

తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్దమేనని... బుల్లెట్లకు ఎదురొడ్డుతామని అన్నారు. ప్రతి ఒక్కరు రాజధాని అమరావతి కోసం కదలాలన్నదే తెలుగుదేశం పార్టీ నిర్ణయమని పేర్కొన్నారు. తమ శవాల మీదనుండి వెళ్లి అసెంబ్లీ లో బిల్లులు పాస్ చేసుకొండంటూ వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

read more  వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు

20వ తేదీన జరుగబోయే అసెంబ్లీ ముట్టడిని సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన తాత రాజారెడ్డి కూడా ఆపలేడన్నారు. ఇది ప్రజా ఉద్యమమని... దీన్ని ఆపడం ఎవరి తరం కాదన్నారు. పశ్ఛిమ బెంగాల్ లో రైతులు ఉద్యమం చేస్తే టాటా కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది... జగన్ ఎంత అని అన్నారు. 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి  ఎక్కడ పేరు వస్తుందోనని భయపడి రాజధానిని మార్పు నిర్ణయం తీసుకున్నారని... ఇది మంచి పద్దతి కాదని  సూచించారు.  ఓట్లు వేసిన ప్రజల నోట్లో మట్టి కొట్టడంకంటూ దుర్మార్గం మరొకటి వుండదంటూ సీఎం జగన్ పై వెంకన్న విరుచుకుపడ్డారు. 

read more  కుటుంబసభ్యులపై కేసు... మనస్తాపంతో అమరావతి రైతు మృతి