అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి లపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్ మూడో  కన్ను తెరిస్తే మీరు భస్మం అవుతారంటూ ఓ మంత్రి ప్రతిపక్షాలను హెచ్చరించాడని గుర్తుచేసిన ఆయన... డిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు భస్మం అయ్యారో బోదపడిందన్నారు. జగన్  తో  సన్నిహితంగా వుండటం వల్లే బిజెపి ఘోర పరాజయాన్నిచవిచూసిందని వెంకన్న సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

''వైఎస్ జగన్ గారు మూడో కన్ను తెరిస్తే అందరూ భస్మం అయిపోతారు అని మంత్రి గారు అంటే ఆయనలో అంత దరిద్రం తాండవిస్తోందా? అని ముందు నమ్మలేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత మంత్రి గారు చెప్పింది నిజమే అని తేలింది.'' 

read more  అమరావతి దీక్షా శిబిరంలో ఉద్రిక్తత... మద్యం బాటిల్ తో దాడి

''చంద్రబాబు గారు చెయ్యి వేసిన వాళ్లు అందరూ భారీ మెజారిటీ తో గెలవడం, జగన్ దగ్గర అవ్వాలని కాళ్ళు పట్టుకున్న వారు దెబ్బతినడంతో మీకు చిన్న మెదడు చితకడం సాధారణంగా జరిగే చర్యే విజయసాయి రెడ్డి గారు..'' అంటూ వెంకన్న సైటైర్లు విసిరారు. 

''కేంద్ర పెద్దల చుట్టూ ఎంపీ విజయసాయి రెడ్డి గారు చకర్లు కొట్టడం, జగన్ గారు కేసుల మాఫీ కోసం కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని వారి చుట్టూ బొంగరంలా తిరగడంతో మీ దరిద్రం ఢిల్లీ పెద్దలకు కూడా అంటుకున్నట్టు ఉంది.'' అని అన్నారు.

''దిగజారి కాళ్లు పట్టుకొని ఆఖరికి అపాయింట్మెంట్ తెచ్చుకున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సాక్షి మబ్బుల లోకం నుండి బయటపడి వాస్తవాలు తెలుసుకోండి. మీ నాయకులతో డప్పు కొట్టించుకొని లోకమంతా సంబరాలే అంటే ఎలా విజయసాయి  రెడ్డి గారు??'' 

read more  రాజధాని విషయం తర్వాత... ముందు దీని సంగతేంటి...: జగన్ ప్రభుత్వంపై పవన్ ఫైర్
 
''మీరు ఏం పీకారని కుళ్లుకోవడానికి? తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలకు దేశంలోనే కాకుండా ప్రపంచ మీడియా సైతం ఛీ కొట్టి, ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. నిద్ర పట్టక మూడు సార్లు ఢిల్లీ వెళ్లి బంగపడ్డారు'' అంటూ వెంకన్న ట్విట్టర్  ద్వారా మరోసారి విరుచుకుపడ్డారు.