రాజధాని విషయం తర్వాత... ముందు దీని సంగతేంటి...: జగన్ ప్రభుత్వంపై పవన్ ఫైర్

కర్నూల్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ జోహరాపురం వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి ప్రభుత్వంపైనే కాదు రాజకీయ వ్యవస్థపైనే విరుచుకుపడ్డారు. 

janasena chief pawan kalyan warning to AP Govt

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండో రోజుపర్యటన కొనసాగుతోంది. గురవారం ఉదయం జోహరాపురం వంతెనను పరిశీలించిన ఆయన సమస్యపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని వ్యాఖ్యానించారు. 

చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచి ఏం ప్రయోజనమని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల మధ్య గొడవ కారణంగా వంతెన నిర్మాణం ఆగిపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు కూడా బాగా ఆలోచించుకోవాలని సూచించారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. 

మూడు రాజధానుల సంగతి తర్వాత...  జోహరాపురం బ్రిడ్జి వంతెన వంటి చిన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఎమ్మిగనూరులో చేనేత కార్మికులను కలుసుకున్న పవన్ వారి సమస్యల గురించి తెలుసుకోనున్నారు. వీటిపై ప్రభుత్వంతో పోరాడి నేతన్నలకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

read more  అంతా దుష్ప్రచారమే.. బీజేపీ అలా చేయదు: సీఏఏపై పవన్ వ్యాఖ్యలు 

అనంతరం జనసేనాని ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో భాగంగా కర్నూల్ శివారులో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. డబ్బు కట్టి ఇల్లులు చేతికి రాని లబ్దిదారులతో మాట్లాడారు.  

లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఈ గృహాలు లబ్ధిదారులకు అందకపోవడం దారుణమన్నారు. దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 

ప్రభుత్వాలు మారి నప్పుడంతా కొత్తగా గృహ నిర్మాణ పథకాలు పెట్టడం ఆఖరులో అవి నిలిచిపోవడం జరుగుతోందని...దీంతో ప్రభుత్వ ఇళ్ల కోసం ఎదురు చూసే ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. 

read more  ప్రీతికి న్యాయం చేయనప్పుడు.. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఎందుకు: పవన్

ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ గృహాలను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం అయిన ఏ పథకం ఆగిపోయినా తానేను ప్రశ్నిస్తానని సవన్ హెచ్చరించారు. 

ఇప్పటినుండి జనసేన పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని తెలిపారు. పోరాటాలు చేసే జనసైనికుల కోసం అన్వేషిస్తున్నామని... అలాంటి వారి అవసరం పార్టీకి చాలా వుందన్నారు పవన్ కల్యాణ్. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios