అమరావతి: గతకొంతకాలంగా వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జగన్  పాలనను విమర్శిస్తూనే విజయసాయి రెడ్డిపై ఫైర్ అయ్యారు బుద్దా వెంకన్న. ఈ క్రమంలో ఇటీవల సీఎం జగన్ పరిపక్వత కలిగిన నాయకుడంటూ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ  వెంకన్న కాస్త ఘాటూ ట్వీట్స్ చేశారు.  

''మానసిక పరిణితి అంటే ఏంటి @VSReddy_MP గారు?తండ్రి శవం దగ్గరకి వెళ్లకుండా సంతకాలు చేయించడమా? తాను ఎంపీ అవ్వడానికి బాబాయ్ ని రాజీనామా చెయ్యమని ఒత్తిడి చెయ్యడమా?పెద్ద రోగంతో పోయిన వారిని తండ్రి కోసం పోయారు అంటూ బుగ్గలు నిమరడమా? తాను గెలవడమే ముఖ్యం తల్లి ఓడిపోయినా పర్వాలేదు అనుకోవడమా?''

''ఇవే మానసిక పరిణితికి కొలమానమా? ఇలాంటి పనులు చేసే వాడినే పిచ్చోడు అని అంటారు అనుకుంటా. ఢిల్లీ వెళ్లి మెడలు వంచినా ఛీ అనే సరికి సూట్ కేస్ కంపెనీకి బుద్ధి రాలేదు. ఇక ప్రజలే బుద్ధి చెబుతారు.''

read more  విజయసాయి గారూ...మీరు నోటికి అన్నమే తింటున్నారా..? లేక..: బుద్దా వెంకన్న
 
''ఎటెట్టా ప్రజా దగా యాత్రలో ఇచ్చిన హామీని జగన్ గారు నిలబెట్టుకున్నారా? చంద్రబాబు గారు కేటాయించిన 363 కోట్ల లో కోత పెట్టి 264 కోట్లు మాత్రమే ఇచ్చారు మీరు @VSReddy_MP గారు. విజయవాడ, హైదరాబాద్ హోటల్స్ లో కూర్చొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా కేసులు వేయించిన విషయం మర్చిపోయారా.''

''ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను తమరు స్వయంగా బెదిరించారు గుర్తులేదా? అగ్రి గోల్డ్ గాయాన్ని పుండు చేసి ఆయింట్మెంట్ రాస్తున్నట్టు బిల్డ్అప్ ఆపండి. చిత్తశుద్ధి ఉంటే దగా యాత్ర లో ఇచ్చిన హామీ ప్రకారం వారంలో 1150 కోట్లు జగన్ గారితో విడుదల చేయించండి విజయసాయి రెడ్డి గారు.''
  
''నిరా రక్షత, దీవితాన్ని, సంఘ సస్కర్తలు,రాజిక సౌద్దన్నాన్ని అని మీ తింగరి మాలోకం చదివిన తరువాత మీకు తెలుగుపై కోపం రావడం సహజం.చూసి చదవడం రానంత మాత్రాన ఎటువంటి ప్రణాళిక లేకుండా ఉన్నట్టుండి తెలుగు మీడియం స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం చేసేస్తాం అంటే ఎలా @VSReddy_MPగారు.''

read more  లోకేష్ పప్పు అయితే జగన్ ముద్దపప్పా: బుద్దా వెంకన్న

''అన్నట్టు మీ దొంగ మీడియాలో రాసేవి అన్ని అసత్యాలు అని మీరే ఒప్పుకోవడం హైలైట్. చంద్రబాబు గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతా అంటే మీ తెలుగు లెస్సేనా, ఎందుకింత తెగులు అని మీ పత్రిక రాసింది. కాస్తైనా మీలో సిగ్గు ఉంటే నీచంగా చిన్న పిల్లల గురించి ఇక మీదట ట్వీట్స్ పెట్టరని అనుకుంటున్నా.'' అంటూ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు.