గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి, శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న తెలిపారు. ఆయన వాడిన భాషను వారి కుటుంబసభ్యులు కూడా అసహ్యహించుకునే విధంగా ఉందని మండిపడ్డారు.

శివకుమార్ వార్డు మెంబర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లాంటి నాయకుడని విమర్శించారు. కనకపు సింహాసనంబున శునకమును గూర్చుండబెట్టినట్లు  ఉంది ఆయన పరిస్థితి అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ప్రజలు ఏమరుపాటుతో వేసిన ఓటు ద్వారా గెలిచిన వారిలో శివకుమార్ ఒకరని ఎద్దేవా చేశారు.  శివకుమార్‌ ఎమ్మెల్యేగా గెలిచానని మరిచి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

read more  రాజధానిపై పూర్తి హక్కు రాష్ట్రానిదే...సెక్షన్-6 ప్రకారం..: టిడిపి ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

 రైతుల త్యాగాలను నడి రోడ్డుపై అమ్మిన దలారి ఈ శివకుమార్‌ అంటే విరుచుకుపడ్డారు. అమరావతి ఉద్యమాన్ని విమర్శిస్తే రాష్ట్ర రైతాంగాన్ని అవమానించినట్లేని బుద్దా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుని విమర్శించే స్ధాయి శివకుమార్‌కి ఇప్పుడే కాదు 100 జన్మలు ఎత్తినా, తాడేపల్లిలోని జగన్‌ ఇంటి ముందు తలకిందులుగా తపస్సు చేసినా రాదన్నారు.

చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవమంత వయసు కూడా ఆయనకు లేదని విమర్శించారు. శివకుమార్‌  చిల్లర రాజకీయాలు, వీధి రౌడీయిజాలకు, తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరని అన్నారు. ఆయన లాంటి వాళ్లు 100 మంది వచ్చినా, జగన్‌ లాంటి వాళ్లు 1000 మంది వచ్చినా చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశాన్ని ఏం చేయలేరని మండిపడ్డారు.

read more   శారదాపీఠంలో జగన్ యాగాలు అందుకోసమే... ప్రజలకోసం కాదు..: పంచుమర్తి అనురాధ

వైసీపీకి అధికార అహంకారం ఉంటే టీడీపీకి ప్రజాబలం ఉందన్నారు. అధికార బలం ప్రజాబలం ముందు తలొంచక తప్పదన్నారు. చంద్రబాబుకు సవాల్‌ విసిరే అంత స్ధాయి శివకుమార్ కు లేదని.... ఆయనను ఎదుర్కోవడానికి తెనాలి తెలుగుదేశం కార్యకర్త చాలని బుద్దా వెంకన్న అన్నారు.