ఆ ఐఆర్ఎస్ అధికారిపై జగన్ కు వ్యక్తిగత కక్ష... ఎందుకంటే...: వర్ల రామయ్య

తెలుగు దేశం పార్టీపై కక్షతో జగన్ ప్రభుత్వం కమ్మ కులానికి చెందిన అధికారులతో అమానుషంగా వ్యవహరిస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్సెన్షన్ పై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

tdp leader varla ramaiah reacts on IRS officer krishna kishore suspention

విజయవాడ: సిన్సియర్ అధికారి అయిన జాస్తి కృష్ణకిషోర్ ను సీఎం జగన్ లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేయించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గతంలో నిస్పక్షపాతంగా వ్యవహరిస్తూ విధినిర్వహణలో భాగంగా జగన్ అవినీతి వ్యవహారాలను కృష్ణకిషోర్  బయటపెట్టారు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.      

ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించిన జగతి పబ్లికేషన్స్‌ అక్రమాలను ఈయనే వెలుగులోకి తెచ్చారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ షేర్ల మాయాజాలాన్ని ఆధారాలతో నిరూపించారని పేర్కొన్నారు. అది మనసులో పెట్టుకునే నేడు సస్పెండ్ చేశారని రామయ్య ఆరోపించారు.. 

నిజంగానే కృష్ణకిషోర్ తప్పు చేసివుంటే విచారించి చర్యలు తీసుకోవాల్సిందన్నారు.  అలా కాకుండా ముందే ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. కృష్ణ కిషోర్ తో పాటు విఆర్ లో ఉన్న డిఎస్పీలను విధుల్లోకి తీసుకోవాలని రామయ్య ప్రభుత్వాన్ని కోరారు.  

read more సత్వర న్యాయం: ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే..

అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో‌ నడుస్తోందన్నారు. కేవలం ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన అధికారులను లూప్ లైన్ లోకి నెడుతోందని అన్నారు. 

ఏకంగా 50మంది డిఎస్పీలను విఆర్ లో ఎందుకు ఉంచారని రామయ్య ప్రశ్నించారు. అదేమంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. 99 సబ్ డివిజన్లలో ఒక్క కమ్మ సామాజికవర్గం అధికారి కూడా లేరని అన్నారు.

read more దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

కమ్మ కులంలో ఉన్న అధికారుల్లో సమర్ధులు లేరా?  అని ప్రశ్నించారు. విఆర్ లో ఉంచి జీతాలు లేకుండా వారి కుటుంబాలను ఇబ్బందులు పడేలా చేస్తున్నారని మండిపడ్డారు.  గతంలో వైయస్ కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

నిజంగా తప్పు చేసి ఉంటే విచారించి వారిపై చర్య తీసుకోవాలని  సూచించారు. పోలీసు ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటంలేదని అన్నారు. వారి ఇబ్బందులను డిజిపి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లరా? ఐపియస్ అధికారులు సంఘం స్పందించరా? అని ప్రశ్నించారు. ఒక్క కులంపై కక్షగట్టి ఆ కులంలో అందరినీ ఇబ్బందులు పెడతారా అని  వర్ల రామయ్య నిలదీశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios