అమరావతి: కేంద్ర బడ్జెట్ లో కనీస నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. దీంతో ఇన్నాళ్ళూ కేంద్రం తమ చెప్పుచేతల్లో ఉందని ప్రగల్బాలు పలికిన ఏ1, ఏ2( సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి) ల మాటల్లో డొల్లతనం బట్టబయలైందని అన్నారు. 

 ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని జగన్ సర్కార్ రద్దు చేసి అసెంబ్లీ ఆమోదాన్ని కూడా పొందింది. ఇక పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం కూడా రద్దు చేసిన పొందిదే మండలి రద్దు పూర్తికానుంది.  అయితే కేంద్రం తమకు స్నేహపూర్వకంగా వుంది కాబట్టి మండలి రద్దు విషయంలోనూ అనుకూలంగా వ్యవహరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఏపికి బడ్జెట్ కేటాయింపులను చూస్తే కేంద్రం వైసిపి చెప్పుచేతల్లో లేదని అర్థమవుతుందని వర్ల రామయ్య వ్యాఖ్యానించడం మండలి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

పక్కనున్న మరో తెలుగురాష్ట్రం తెలంగాణ సాధించిన మేరకైనా బడ్జెట్ లో ఏపీకి నిధులు సాధించలేకపోవడం దారుణమన్నారు. ఇది ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు.  

read more  ''పరిటాల హత్య జేసి కుట్రే... తుపాకులు సమకూర్చింది ఆయనే...''

సీబీఐ కేసుల మాఫీకి నిరంతరం తపించే ముఖ్యమంత్రి జగన్ కేంద్ర బడ్జెట్ పై దృష్టి సారిస్తారని ప్రజలు ఆశలు పెట్టుకోరని దెప్పిపొడిచారు. జగన్, విజయసాయిరెడ్డిలు డిల్లీ వెళ్ళేది రాష్ట్రానికి నిధులు సాధించడానికి కాదని ఈ బడ్జెట్ లో ఏపికి కేటాయింపులను చూస్తే తేటతెల్లం అవుతోందన్నారు. 

సీబీఐ కేసుల మాఫీ చేసుకోవడంలో సీఎంకు ఉన్న తపన కేంద్ర బడ్జెట్ లో నిధులను రాబట్టడంలో లేదని... కనీస ప్రయత్నం కూడా చేయలేరని ఆరోపించారు. 
రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో ఏమీ ప్రకటించక పోయినా నోరు మూసుకు కూర్చోవడం ఏమిటి? అని రామయ్య ప్రశ్నించారు.

8 నెలల కాలంలో కేంద్రం నుంచి ఒక్కపైసా సాధించలేక పోవడానికి జగన్ లో బలహీనతలు ఏమిటి? ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రితో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమిటి? అంటూ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, విధుల పట్ల జగన్ ధ్యాస పెట్టక వడంలో ఆంతర్యం ఏమిటో తెలియాలన్నారు రామయ్య.

 ఏపీలోని 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు సాధిస్తామని ఎన్నికలకు ముందు జగన్ పలికిన ప్రగల్భాలు ఇప్పుడు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజలు జగన్ హామీలను నమ్మి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించారని... వారి నమ్మకాన్ని వమ్ము చేయడం తగదన్నారు. 

read more  కొన్ని బాగున్నాయి, కానీ ఏపీకి నిరాశే: కేంద్ర బడ్జెట్‌పై బుగ్గన స్పందన

ఎంపీలు విజయసాయి రెడ్డితో సహా వైసిపికి  23 ఎంపీల బలం వుందని... అయినా విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంపై ఒత్తిడి చేయడం మరిచిపోయారని విమర్శించారు. 
సీబీఐ పెట్టిన 11 కేసుల నుండి బయటపడటానికి జగన్, అతని సహచరులు పడరాని పాట్లు పడుతున్నారని వర్ల రామయ్య ఘాటుగా విమర్శించారు.