గుంటూరు: అక్షరాల 32 వేల ఎకరాలు వైఎస్‌ కుటుంబం దోచుకొని చాలా మందిని బీనామీలుగా చేర్చుకున్నారని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రులుగా పని చేసిన వారే చెబుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. సర్వీస్‌ ల్యాండ్స్‌, అసైన్డ్‌ భూములు, మాజీ సైనికులు భూములను అదే విధంగా 22ఏ భూములను అనేక రకాలుగా  కొట్టేశారని తెలిపారు. వైసీపీ 9నెలల పాలనలో అంత కంటే ఎక్కువ భూములను కొట్టేశారని అనురాధ సంచలన ఆరోపణలు చేశారు.  

 సీఎం జగన్ తాత రాజారెడ్డి పేరు మీద రాజశేఖర్ రెడ్డి వైజాగ్‌లో ఎన్ని భూములు కొన్నారో అందరికి తెలుసన్నారు. అలాగే వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన ధర్మాన ప్రసాద్‌ గురించి ఎక్స్‌ సర్వీస్‌ మ్యాన్‌ అప్పరావు అనే వ్యక్తిని ఆడిగితే ఏవిధంగా కబ్జా చేశారో తెలుస్తోందన్నారు. అదే విధంగా గుబ్బల గోపాలకృష్ణా అనే వ్యక్తి  ధర్మాన ప్రసాద్‌ కుమారుడి పేరు మీద ఏవిధంగా భూములు రాయించారో అందరికి తెలుసన్నారు అనురాధ.

రుషికొండ ఏరియాలో భూములను ఏవరు కబ్జా చేశారో కుమార్‌ అనే వ్యక్తిని నార్కో ఎనాలిసిస్‌ టెస్ట్‌ చేస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.  వైఎస్‌ సుధీర్‌ రెడ్డి పేరు మీద 20,592 ఎకరాలు, బాక్సైడ్‌ నిధులు రూ.8కోట్ల ఆస్తి ఉందని ఆరోపించారు. పెన్నా ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి పేరు మీద  10వేల ఎకరాలు రూ.1లక్ష కోట్ల ఆస్తి ఉందన్నారు. అనిల్‌ కుమార్‌ పేరు మీద 1867 ఎకరాలు రూ.2500 కోట్ల ఆస్తి ఉందని అనురాధ ఆరోపించారు. 

బాక్సైడ్‌ నిక్షేపాలను వైఎస్‌ కుటుంబం దోచుకోవడంతో ఈ రోజుకు కూడా సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం పెన్నా సిమెంట్‌ విషయంలో సీబీఐ వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. విశాఖలో ఉన్న భూముల కోసం, వారి ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రస్తుతం ప్రయత్నాుల ముమ్మరం చేశారని...అందుకోసమే రాజధానిని తరలిస్తున్నారని అన్నారు.

read more  అమరావతిలో విషాదం...మద్యంలో పురుగుల మందు, ఇద్దరు మృతి

22ఏ అనేవి ప్రభుత్వం భూములని... ఇవి ప్రభుత్వ భూములు కావు ఇవి తమవి అని ఎవరైనా జాయింట్‌ కలెక్టర్‌కు అప్లికేషన్‌ పెట్టుకుంటే డాక్యుమెంట్స్ పరిశీలించి వారికి ఇవ్వడం జరుగుతోందన్నారు. దీన్ని ఉపయోగించుకుని గత 7 నెల నుంచి జగన్మోహన్‌రెడ్డి తనకు ఇష్టమెచ్చిన వారికి 22ఏ భూములను కట్టబెట్టారని... ఇలా కట్టబెట్టిన భూములన్ని విశాఖలో వున్నాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఈ భూములకు సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో బహిరంగ చర్చకు వైసీపీ నాయకులు సిద్దామా? అని అనురాధ సవాల్ విసిరారు.

విశాఖ టైకున్‌ రెస్టారెంట్‌ దగ్గర 4 ఎకరాల క్రిస్టియానిటి వర్గాల భూమి వుందని... అయితే దీనికోసం రెండు వర్గాల వారు  గొడవ పడుతూ కోర్టును కూడా ఆశ్రయించారని తెలిపారు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులో వుండగానే స్థానిక ఎంపీ 8 నెల నుంచి అక్కడే తిరుగుతూ సెంటిల్‌మెంట్‌ చేసుకోవడం కోసం అగ్రిమెంట్‌ చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పాలన్నారు. 

దీనికి కూతవేట దూరంలో లూలూ గ్రూప్‌ను చంద్రబాబునాయుడు తీసుకురావడం జరిగిందన్నారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టే లూలూ గ్రూప్‌ను ఈ రోజు దానిని వెళ్లాగొట్టారని అన్నారు.   నాలుగు ఎకరాల భూమిని అభివృద్ధి చేసుకొని దాదాపు రూ.1000 కోట్ల ఆస్తి సంపాందిచడం కోసం ఎంపీ ప్రయత్నిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారని అనురాధ  తెలిపారు.

చీడపురుగులు అనే దానికి మారు పేరు ఈ ఆడిటర్ అంటూ పరోక్షంగా విజయసాయి రెడ్డిపై అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు.వైసీపీ వాళ్లకు సీట్లు ఇప్పించడంలో ఈయన ముఖ్యపాత్ర పోషించారని... ఎన్నికల ముందు వైసీపీకి ఫండింగ్‌ రావడానికి ముఖ్యపాత్ర పోషించారని పేర్కొన్నారు.  ఇప్పుడు వైజాగ్‌లో ఉండకుండా హైదరాబాద్‌కు మాకం మార్చారని... తెలంగాణ నుంచి మిషన్‌ భగీరథ కాంట్రాక్టు వర్క్‌లు తెచ్చుకొని పనులు చేసుకుంటున్నారని  ఆరోపించారు.

ఇతని ప్రత్యేకత తన వ్యక్తులను తానే బ్లాక్‌మెయిల్‌ చేయడమని విమర్శించారు. నీళ్లకుండీల దగ్గర లేఆవుట్లు వేసుకొని వాటికి రేట్లు పెంచడం కోసమే రాజధాని తరలింపు చేస్తున్నారని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హనుమంతువాక నుంచి సింహాచలం వేళ్లే దారిలో 400 ఎకరాల ప్రభుత్వం భూము ఉందని... దానికి రేట్లు పెంచడం కోసమే ఆరు లైన్ల రోడ్లు వేశారని అన్నారు. ఈ రోజు ఆ ప్రభుత్వం భూములు 22ఏ కింద ఉంటే అది మాది అని చాలా మంది వైసీపీ నాయకులు తిరుగుతున్నారని అన్నారు. అది దాదాపు రూ.400కోట్ల ఆస్తి...దాని గురించి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.

read more  మరో కీలక నిర్ణయం దిశగా జగన్... త్వరలో ప్రభుత్వ ప్రకటన: ఎమ్మెల్యే గోపిరెడ్డి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాల భూములను కొట్టేయాలనే జీవో నెం: 72 తీసుకువచ్చారని ఆరోపించారు.  పేదవారి భూములు 10వేల ఎకరాలు కొట్టేసి 1000ఎకరాలు పేదవారికి ఇళ్ల రూపంలో ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ బోత్స, ఆయన ఆల్లుడు శ్రీనివాసు తెలివితేటలని.. వారి తెలివితేటలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

ఖచ్చితంగా ఈ ల్యాండ్‌ పూలింగ్‌పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరగకపోతే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ధర్మాన ప్రసాద్‌ గురించి అంతా అధర్మమని పేపర్‌లో వచ్చిందని.. అలాగే ఖద్దరు కన్ను అని..బోత్స సోదరుడు భూ కబ్జాయత్నం చేస్తున్నారని స్పందన ప్రోగ్రామ్‌లో పెట్టడం జరిగిందన్నారు. దీని గురించి వైసీపీ నాయకులు సమాధానాలు చెప్పాలన్నారు. ప్రభుత్వం మాది... సీఎం మావాడని వైసీపీ నాయకులు స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారని...దీనిపై ఖచ్చితంగా జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు.