రెండువేల కోట్ల బాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కు భాగం.: మంత్రులు

First Published 14, Feb 2020, 3:50 PM

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతం తాజా ఐటీ దాడులతో బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా మంత్రులు కూడా ఈ ఐటీ దాడులు, చంద్రబాబు అవినీతి వ్యవహారంపై స్పందించారు. 

ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ దాడుల్లో రెండు వేల కోట్లు పట్టుబడ్డాయని ఐటీ శాఖ ప్రకటించినప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ ప్రముఖ వ్యక్తికి గతంలో పీఏగా పనిచేసిప వ్యక్తిపై జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. అయితే ఆ ప్రముఖ వ్యక్తి చంద్రబాబు నాయుడేనని... ఇటీవల అతడి పీఏ పైనే ఐటీ దాడులు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు స్పందించారు.

మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు: ''ఓ సీఎం వద్ద పని చేసిన పీఏ ఇంట్లో ఏకంగా 6 రోజులు ఐటీ సోదాలు జరపడం నా జీవితంలో చూడలేదు. రూ.2 వేల కోట్ల అక్రమార్జన గుర్తించడం మాములు విషయం కాదు. మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న లోకేష్‌ కంపెనీల విలువ ఒక్కసారిగా ఎలా పెరిగింది?'' అని ప్రశ్నించారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ : ''చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలి. ఇప్పుడు బయటపడిన రూ.2 వేల కోట్ల అవినీతిపై పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదు? చంద్రబాబు అవినీతిలో పవన్‌ కళ్యాణ్‌కూ భాగస్వామ్యం ఉంది'' అని ఆరోపించారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ : ''పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో గత ప్రభుత్వ పెద్దలు భారీ అవినీతికి పాల్పడ్డారు. తమ అవినీతిని ఎవరూ పట్టుకోలేరని చంద్రబాబు భావించారు. సీఎంగా పని చేసినప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడుగా ఉండాలి కానీ దోపిడీదారుడిగా కాదు. మనీ లాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట. అడ్డంగా దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు స్పందించటం లేదు'' అని విమర్శించారు.

మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి : ''చీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకు రూ.2 వేల కోట్ల స్కామ్‌ కనిపించడం లేదా?. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉంది. కాబట్టి సీబీఐ దర్యాప్తు జరపాలి. ఈ విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ కూడా జోక్యం చేసుకుని, చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలి'' అని కోరారు.

మంత్రి కురసాల కన్నబాబు : ''చంద్రబాబు ఎంత దోచుకున్నారన్నది ఐటీ సోదాలతో తేలిపోయింది. చంద్రబాబు అవినీతి, దాని వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు కూడా అర్ధమైంది. ప్రతి రోజూ మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదు?'' అని ప్రశ్నించారు.

మంత్రి ధర్మాన కృష్ణదాస్ : ''చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైంది. గతంలో సీబీఐని వ్యతిరేకించింది ఇందుకేనా? అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలి. ప్రజలు అవినీతిని సహించడం లేదు. పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారు'' అని అన్నారు.

మంత్రి అంజాద్‌ బాషా: ''చంద్రబాబు అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోంది. చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రతి ప్రాజెక్టులో చినబాబుకు కమీషన్లు వెళ్లేవి. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి'' అని మంత్రి విమర్శించారు.

loader