సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న జగన్:

సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి తాడేపల్లి నుంచి జగన్ బయల్దేరనున్నారు.

3.45 గంటలకు పట్టణంలోని లింగవరం రోడ్‌లోని ఉన్న కే. కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5.35 తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. 

సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు నాయుడు:

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజి సర్కిల్‌లో జరిగిన భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జేఏసీ నేతలు పాల్గొన్నారు. బెజవాడలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో యువత భారీగా పాల్గొన్నారు. డ్యాన్సులు, ఆట పాటలతో చిన్నా, పెద్దా సందడి చేశారు.

Also Read:

పవన్, బాబులకు చెక్: అమరావతిపై వైఎస్ జగన్ సరికొత్త వ్యూహం

ఏపీ రాజకీయాల్లోకి నందమూరి సుహాసిని .. రాజధాని రైతులే టార్గెట్