కృష్ణా జిల్లా:   జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవననిర్మాణ కార్మికులని రోడ్డున పడేసిందని ఎమ్మెల్సీ అశోకబాబు విమర్శించారు.  నూజివీడు లో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష నిర్వహించారు.  ఇందులో పాల్గొన్న అశోక్ బాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.

వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక కుంభకోణం జరిగిందని...ఇందులో టీడీపీ నాయకులు కోట్లు సంపాదించారనే నెపంతో ఇసుక తవ్వకాలను నిలిపివేశారని అన్నారు. దీంతో భవననిర్మాణ కార్మికులని రోడ్డున పడ్డారని ఆరోపించారు.

 read more ఇసుక కొరత... మరో మాజీ ఎమ్మెల్యే దీక్షకు పిలుపు

ఈ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు చర్యలు తప్ప పాలన సాగటం లేదని అన్నారు. రాజధాని అమరావతిని కూడా మార్చేందుకు కుట్రచేస్తున్నారని పేర్కొన్నారు. 

ప్రతిపనికి జె ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. లిక్కర్ షాపులు కూడా ప్రభుత్వం నడిపేటప్పుడు ఫ్రీగా ఇవ్వవలసిందిపోయి రేట్లు పెంచి అమ్ముతున్నారని విమర్శించారు. 

ఈ కార్యక్రమంలో నూజివీడు ఇంచార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, తిరువూరు ఇంచార్జి స్వామిదాసు ప్రభుత్వ తీరుపై ఇరుచుకుపడ్డారు.దీక్షలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలొ  నెలకొన్న ఇసుక కొరతపై పోరాడేందుకు మరో మాజీ ఎమ్మెల్యే సిద్దమయ్యారు. టిడిపి మహిళ నాయకురాలు తంగిరాల సౌమ్య ఇసుక కొరతపై నిరాాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.  

read more video news : ఇసుక విధానంపై టీడీపీ సామూహిక నిరసన

రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఇసుక కొరత నెలకొనడంతో ప్రజల తరపున ప్రతిపక్ష తెలుగు దేశం పోరాటినికి దిగింది. కొద్దిరోజుల క్రితమే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మహిళా నాయకురాలు తంగిరాల సౌమ్య దీక్షచేపట్టారు. తాజాగా టిడిపి పార్టీ శ్రేణులు మొత్తం నిరసనబాట పట్టాయి.  

వైసిపి నాయకుల కనుసన్నల్లో ఇసుక దందా కొనసాగుతోందని...ఈ పరిస్థితి నుండి రాష్ట్రాన్ని బయటపడేసేందుకే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్్లు టిడిపి పేర్కొంటోంది.ముఖ్యంగా నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులు ఉపాది కోల్పోయి రోడ్డునపడ్డారని...వారి కుటుంబాల్లో ఆకలిబాధలు చూసి సహించలేకే ప్రభుత్వంపై పోరాటానికి దిగినట్లు టిడిపి ప్రకటించింది. 

వీడియో