Asianet News TeluguAsianet News Telugu

ఇసుక కొరతపై ఉద్యమబాటలోకి సిపిఐ... మార్చ్ కి పిలుపు

ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరతపై ఉద్యమానికి సిద్దమైనట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ తరపున చేపట్టే నిరసన కార్యక్రమాలను ఆయన ప్రకటించారు.  

sand shortage in ap... cpi march against YSRCP government's sand policy
Author
Vijayawada, First Published Nov 9, 2019, 5:46 PM IST

విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను నిరసిస్తూ సీపీఐ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  వెల్లడించారు. ఈ మేరకు విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు చేపట్టనున్నట్లు... ఇందులో ప్రతిపక్ష పార్టీలన్ని   మద్దతును కోరారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించిందని ఆరోపించారు. దీంతో నిర్మాణరంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని  కోల్పోయారని... కనీసం కుటుంబానికి తిండికూడా పెట్టలేని పరస్థితుల్లో మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇలా కార్మికులు కడుపు మంటలో బలవన్మరణాలకు పాల్పడితే వీటిపై మంత్రులు వ్యంగంగా కామెంట్స్ చేయడం తగదన్నారు. 

విజయనగరంలో పోలీసులతో కుమ్మకై  కొందరు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని గుర్తుచేశారు. అలా రాష్ట్ర  ప్రజలకు అందకుండా ఇసుక ఇతర రాష్ట్రాలను తరలుతోందని...అందువల్లే రాష్ట్రంలో ఈ కొరత ఏర్పడిందని ఆరోపించారు.

read more  Bulbul Cyclone: దూసుకొస్తున్న బుల్ బుల్ తుపాను...పెను విధ్వంసమే

నవంబర్ 12వ తేదీన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ఇసుక మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే 13వ తేదీన వామపక్ష నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా వారి వారి ప్రాంతాల్లో ఇసుక మార్చ్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. 

అలాగే వెలుగు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. తాము అధికారంలోకి వస్తే కొత్త ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ కల్పనను మరిచి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఆరోపించారు. వెలుగు ఉద్యోగుల తరపున కూడా పోరాడేందుకు సిద్దంగా వుంటామన్నారు. 

  read more  నా గురించి వాగితే ఖబర్దార్...దేవినేని ఉమకు వైసిపి ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై ఆంధ్ర ప్రదేశ్ సిపిఐ శాఖ ఇప్పటికే నిరసనబాట పట్టింది. కర్నూల్ నగరంలో ఏర్పడ్డ ఇసుక కొరతపై నిరసనగా సీపీఎం పార్టీతో పాటు అనుబందం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో భవన కార్మికులు సంఘం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించారు. 

జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇసుక కొరతతో కర్ములికులు ఉపాధి కోల్పోయారని వారు ఆరోపించారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక కొరతను తీర్చి 5 నెలలుగా ఉపాధి కోల్పోయి నష్టపోయిన భవన కార్మికులకు రూ.10 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

స్థానిక కార్మికుల పక్షాన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. అలాగే నగరంలో ఇసుక కోరత లేకుండా చర్యలు తీసుకొని తమ ఉపాధిని పునరుద్దరించాలని భవన నిర్మాణ కార్మికులు సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios