అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  స్టార్టప్ ఏర్పాటుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు ‘నాస్కామ్’ సీఈవో సంజీవ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుతం ఐటీ రంగంలో హాట్‌టాపిక్‌గా మారిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ)పై పరిశోధన కోసం రాష్ట్ర ప్రభుత్వం-నాస్కామ్ సంయుక్తంగా స్టార్టప్ లకు అనువైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రధానంగా చర్చలు జరిగాయి.  

కృష్ణా జిల్లా విజయవాడలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో  మంత్రి నివాసంలో శుక్రవారం సాయంత్రం నాస్కామ్ సంస్థ సీఈవో సంజీవ్ మల్హోత్రా సమావేశమయ్యారు.

read more  సీఎం జగన్ విశాఖ పర్యటన... ఎలా సాగనుందంటే...

 ఏపీలో స్టార్టప్ ల  ఏర్పాటుకు నాస్కామ్ సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ సీఈవో  మంత్రికి స్పష్టం చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని నాస్కామ్ సీఈవో సంజీవ్ మల్హోత్రా మేకపాటిని కోరారు.  

విశాఖలో రోబోలు, చాట్ బాట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ , ఆటో మొబైల్స్, వైద్య రంగాల్లో డేటా అనలిటిక్స్, పవర్ ప్లాంట్ రంగాలలో స్టార్టప్ లను వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో స్టార్టప్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని మంత్రి మేకపాటి నాస్కామ్ సీఈవోకు హామీ ఇచ్చారు. 

read more  రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్... తాజాగా మరింత ఆదా: బొత్స

సంస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ అనుమతులకు తమ సహకారం తప్పక ఉంటుందని మంత్రి అన్నారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖల నుంచి స్టార్టప్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సాంకేతికపరమైన విషయాల్లో పూర్తి సహకారమందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 

అవసరమయితే కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  శాఖ నుంచి నిధులు సమకూర్చి స్టార్టప్ లకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తామని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.