అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతుల కోసం మంగళవారం నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత  ప్రజలు, రైతులు, మహిళలతో కలిసి  ఏపి సచివాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ద్వజమెత్తారు. 
 
మూడు రాజధానులు అంటే ముగ్గురు అన్నదమ్ముల వ్యవహారంగా చూడాలని...కానీ పవన్ కల్యాణ్ మాత్రం మూడు పెళ్లిల్ల వ్యవహారంలా చూస్తున్నారని ఆమె సెటైర్లు విసిరారు. ఈ విషయాన్ని పవన్ గుర్తుంచుకుంటే మంచిదన్నారు. 

ఇక ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మజ సీఎం జగన్ పై చేసిన విమర్శలపై కూడా నారపల్లి పద్మజ స్పందించారు. రాష్ట్ర  ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జగన్ పై అవాకులు చెవాకులు పేలితే సహించబోమన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల మైలేజ్ వస్తుందని ఆమె భావిస్తోందని  అన్నారు. మైలేజ్ సంగతి అంటుంచితే ఆమె లాంటి వారి వల్ల అసలే భూస్దాపితం అయిన కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యల వల్ల మరింత దిగజారనుందని అన్నారు.  ఆ పార్టీ పేరును ఉచ్చరించడానికే ప్రజలు అసహ్యించుకుంటారనేది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

read more రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా... గుణపాఠం తప్పదు: పవన్

మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషిని దేశమంతా గుర్తించిందన్నారు. పక్క రాష్ర్టంలో దిశ అనే యువతిపై అత్యాచారం, హత్య జరిగితే కేవలం రోజుల వ్యవధిలో దిశ చట్టం తీసుకువచ్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. ఆ చట్టంపై దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం దృష్టి సారించి మార్గదర్శకంగా తీసుకుంటున్నాయని అన్నారు. 

తమ ప్రభుత్వం ఎస్సి ఎస్టి బిసి మైనారిటి మహిళలకు అన్ని విషయాల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మద్యంను దశలవారీగా నిషేదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళ ఉన్నతికి తోడ్పడుతున్న జగన్ పై విమర్శలు మానుకోవాలని పద్మశ్రీ లాంటి వారికి హెచ్చరిస్తున్నానని అన్నారు. విలువలు, సంస్కారంతో వ్యవహరించమని సీఎం తమకు చెప్పారు కాబట్టి ఊరుకుంటున్నామని....లేకపోతే ఆమె వద్దకే వెళ్లి తగిన  రీతిలో సమాధానం చెప్పేవాళ్లమని హెచ్చరించారు.

రాజధానిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగడం లేదన్నారు.రాజధాని సైతం తరలిపోవడం లేదని.... లెజిస్లేజివ్ రాజధాని ఇక్కడే ఉంటుందన్నారు.రాజధాని రైతులకు కౌలు జగన్ అధికారంలోకి వచ్చాక చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు. అబివృద్ది చేసిన ప్లాట్లు ఇస్తామని కూడా సీఎం స్వయంగా చేప్పారని అన్నారు.

read more  నేను పోలీసు కొడుకునే: పోలీసులపై పవన్ ఫైర్

రైతులపేరుతో రియల్ ఎస్టేట్ దందా చేసేవారు తమకు అన్యాయం జరుగుతుందని బావించి ఆయా గ్రామాల ప్రజలను మభ్య పుచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయ కుట్రలకు తెరతీశారని....ఇది ఆయన నీచ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

 చంద్రబాబు హయాంలో పెందుర్తి, కుప్పంలలో మహిళలను వివస్ర్తలను చేసిన సమయంలో.... ప్రభుత్వ అధికారిణి వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి సందర్భంలోగానీ ఈ సుంకర పద్మశ్రీ ఎక్కడకు వెళ్లింది....కాంగ్రెస్ పార్టీ నోరెందుకు ఎత్తలేదని నారమల్లి పద్మశ్రీ ప్రశ్నించారు. ఈరోజు చంద్రబాబు ఆడమన్నట్లుగా సుంకర పద్మశ్రీ లాంటి వారు ఆడుతున్నారని ఆరోపించారు.