నవ మాసాలు మోసి పండిటి బిడ్డకు జన్మనిచ్చింది. కళ్ళు తెరివని బిడ్డను చూసుకుని మురిసిపోయింది ఆ తల్లి.. అంతలోనే దేవుడు ఆ పిల్లాడిని చిన్న చూపు చూశాడు. బిడ్డను చూసుకుంటూ  అనందంతో ఉన్న ఆ తల్లిని ఈ లోకం నుంచి దూరం చేశాడు.

also read: ప్రాణాల మీదికి తెచ్చిన పాత కక్షలు

తిరువూరు మండలం కోకిలంపాడు కు చెందిన జొన్నకూటి స్వర్ణలత (22) అనే మహిళా గర్భిణీ. ఆమెకు డెలివరీ డెట్ దగ్గర  కావడంతో ఈ నెల 19 వ తేదీన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమే ఓ  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్వర్ణలత అనే బాలింతరాలు ఒక్కసారిగా ఫీట్స్ రావడంతో వైద్యం అందించే క్రమంలో కన్నుమూసింది..

అయితే స్వర్ణలత చావుకు వైద్యులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు మాత్రం గుర్రపాతం వలన చనిపియింది అని  చెబుతున్నారు. తమ కుమార్తె చావుకు ప్రభుత్వ వైద్యులే కారణమని తల్లి వాపోయింది. 

కన్నులు తెరవని ఆ పసికూనని కన్నులు మూసిన ఆ తల్లి,భార్యాను కోల్పోయిన భర్తను,కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి తడి పెట్టించాయి..