కృష్ణా జిల్లా: విజయవాడ పట్టణంలో నివసిస్తున్న అర్హులందరికీ ప్రభుత్వం తరపున ఇళ్లపట్టాలు అందిస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో, రైల్వే స్థలాల్లో నివాసముంటున్న నిరుపేదలకు ఇళ్లపట్టాల క్రమబద్దీకరణ కూడా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.   శుక్రవారం. నగరంలోని వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో గల దేవదాయ శాఖ భవన సముదాయంలో మంత్రి  రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ... సిఎం జగన్ మోహన్ రెడ్డి అశయ సాధనలో భాగంగా రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. అర్హులైన అందరికీ ఉగాది నాటికి ఇళ్ళు, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నదే  జగన్ లక్ష్యంగా నిర్దేశించారని... ఆ దిశగానే  ప్రభుత్వం  పనిచేస్తోందని మంత్రి  సూచించారు.

read more  ఉగాది నాటికి ఇళ్లపట్టాలు.. నయాపైసా తీసుకోం: బొత్స సత్యనారాయణ

పశ్చిమ నియోజక వర్గంలో అధిక భాగం కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ముఖ్యంగా 20 డివిజన్లలో అధిక భాగం కొండ ప్రాంతాల్లోనే నివాసముంటున్నారని...వీరికి ముందుగా ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ చేయించేందుకుచర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 

అలాగే రైల్వే మరియు ఇతర ప్రభుత్వ భూములలో నివసించే వారి పట్టాల  క్రమబద్దీకరించెందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైతే  ప్రత్యేకంగా సర్వే నిర్వహించేందుకు సాధ్యాసాద్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు.

 మంత్రి వెలంపల్లితో సమావేశమైన వారిలో జేసీ మాదవి, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్, ఎమ్మార్వో లు సుగుణ, రవీంద్ర మరియు స్థానిక రెవిన్యూ అధికారులు వున్నారు. మంత్రి ఆదేశాల ప్రకారం ఉగాది నాటికి ఇళ్లపట్టాలు అందించే ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 

read more  ఏపిలో భారీ ఉద్యోగాల భర్తీ... సీఎం జగన్ ఆదేశం

ఈనెల 16న జరగిన కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఉగాదికి ఇళ్లపట్టలా పంపిణీ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పండగనాటికి నిరుపేదలకు ఇళ్లస్థలాలు అందించే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి వెల్లంపల్లి అధికారులతో సమావేశమయ్యారు. 

వీడియో