Asianet News TeluguAsianet News Telugu

ఉగాది నాటికి ఇళ్లపట్టాలు.. నయాపైసా తీసుకోం: బొత్స సత్యనారాయణ

ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని కేటాయిస్తామని.. ఇళ్ల నిర్మాణానికి ఎవ్వరూ నయాపైసా చెల్లించనక్కర్లేదున్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

House site pattas will be given to the poor on Ugadi: AP minister botsa satyanarayana
Author
Amaravathi, First Published Oct 17, 2019, 4:49 PM IST

ఇళ్ల పట్టాల పంపిణీకి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా అర్హులైన వారిని ఇంకా గుర్తించి లబ్ధిదారుల కిందకు చేరుస్తామని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలా కాకుండా అవకాశం ఉన్నంత మేరకు వ్యక్తిగత నివాసాలను నిర్మించి ఇస్తామని బొత్స స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఉగాది నాటికి అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఇళ్ల నిర్మాణానికి భూసేకరణతో పాటు అవసరమైన మేరకు భూమిని కొనుగోలు చేస్తామని బొత్స వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లకు మరమ్మత్తులు చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

గత ప్రభుత్వం నిర్మించి, నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇళ్లు లేని వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించారని అందువల్ల గృహ నిర్మాణ పథకంపై దృష్టిసారించామన్నారు.

ధనవంతులే కాకుండా పేదవారు సైతం బంగ్లాలో ఉండాలనేది ముఖ్యమంత్రి కల అని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ అర్హుల వద్ద నుంచి నయా పైసా కూడా వసూలు చేయమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ పట్ణణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లోనూ రివర్స్ టెండరింగ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5వేల కోట్ల పనులను ఏపీ టిడ్కో చేపట్టింది ఇందుకు సంబంధించి వివిధ స్థాయిల్లో టిడ్కో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్‌కు ఈ నిర్ణయం వల్ల వీలు కలుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ పట్ణణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లోనూ రివర్స్ టెండరింగ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5వేల కోట్ల పనులను ఏపీ టిడ్కో చేపట్టింది ఇందుకు సంబంధించి వివిధ స్థాయిల్లో టిడ్కో ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్‌కు ఈ నిర్ణయం వల్ల వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేశారు. 

పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో కూడ అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్లేందుకు వీలుగా రివర్స్ టెండరింగ్ చేస్తున్నట్టుగా జగన్ ప్రకటించారు. రూ. 10 లక్షల విలువైన కొనుగోళ్లు లేదా పనుల నిర్వహణకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసింది.

సంబంధిత వార్తలు:

ఏపీ పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లోనూ రివర్స్ టెండరింగ్

ఉగాది నాడు 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ: పిల్లి సుభాష్ చంద్రబోస్

Follow Us:
Download App:
  • android
  • ios