Asianet News TeluguAsianet News Telugu

9 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్‌పై దేవినేని ఫైర్

ఏపీలో కరెంట్ కోతల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. తొమ్మిది నెలల పాలనలోనే జగన్‌ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారని ఉమా ఆరోపించారు

ex minister devineni umamaheswara rao fires on ap cm ys jagan over pensions issue
Author
Vijayawada, First Published Feb 11, 2020, 5:05 PM IST

ఏపీలో కరెంట్ కోతల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. తొమ్మిది నెలల పాలనలోనే జగన్‌ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారని ఉమా ఆరోపించారు.

Also Read:టీడీపీ నేతలకు గన్‌మెన్ల తొలగింపు.. నేను మీలా చేసుంటే: జగన్‌పై బాబు వ్యాఖ్యలు

విద్యుత్ చార్జీలు పెంచి లక్షలాది మంది విద్యుత్ వినియోగదారుల నెత్తిన రూ. 1300 కోట్ల పెనుభారంతో పిడుగు పాటుకు గురి చేశారని ఆయన విమర్శించారు. పెన్షన్ మొత్తం పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన విధానంలో పెన్షన్లను తొలగించి ఆవేదన మిగల్చడం బాధాకరమని పేర్కొన్నారు.

కొత్త మార్గదర్శకాలతో ఒక్కసారిగా అనర్హులుగా పేర్కొని, ఇన్నాళ్లు... పెన్షన్ తోనే బతుకు ఈడుస్తున్న వారిపై ఇలా కత్తి వేటు వేయడం భావ్యమా..? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. మైలవరంలో పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసే హక్కు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని దేవినేని నిలదీశారు.

Also Read:ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు... చంద్రబాబు ఫైర్

పూరగుట్టలో రెండు సెంట్లు స్థలం పేదలకు ఇవ్వాల్సిందేనని... అయ్యప్ప నగర్ లో ఇచ్చిన పట్టాలను కొనసాగించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.  వెరిఫికేషన్ పేరుతో ఐదు మండలాల్లో తొలగించిన పింఛన్లను రేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని ఉమా అధికారులను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios