విజయవాడ: వైసీపీ ప్రభుత్వ చేతకానితనం వల్ల రాష్ర్టంలో లక్షలాది మంది దాన్యం రైతులు కన్నీళ్లు పెడుతున్నారని... కౌలు రైతులు రోడ్డెక్కి రోదిస్తున్నా వారి బాధలు ప్రభుత్వానికి పట్టవా అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ధాన్యం రైతులు బకాయిలు అందక కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్, బూతుల మంత్రి కొడాలి నాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

మంత్రి నాని డిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు... అయితే ఎన్ని నిధులు తెచ్చారో మాత్రం ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు. రాష్ర్టంలో రూ.  1955 కోట్లు దాన్యం రైతులకి బకాయిలివ్వాలని... అనకాధికరంగా మరో రూ. 2 వేల కోట్లు  ఇవ్వాల్సి ఉందన్నారు. దాన్యానికి మిల్లుల్లో తోలి బిల్లులు చెల్లింపులు జరిగితే ఆన్ లైన్ సమాచారం ఇవ్వాలని... అయితే వైసీపీ మంత్రుల తెలివితేటలతో  మిల్లుల దగ్గర వాటిని తొక్కిపెట్టి రైతుల్ని దళారులకు అప్పగించారని ఆరోపించారు.

సాదారణంగా రైతులకు రెండు రోజుల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది... కుదరకపోతే రెండు వారాల్లో ఇవ్వాలి... కానీ వైసీపీ  ప్రభుత్వం చేతకానితనం వల్ల  3 నెలలకు పైగా దాన్యపు రైతుకి డబ్బులివ్వలేదని అన్నారు. దీనిపై వైసిపి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. 

''మంత్రి కొడాలి బూతులు తిడితే పెద్దవాడవ్వడు. మంత్రి పదవి అంటే కిల్లీలు ఉయ్యటం కాదు. నాని లాంటి చేతకాని, చేవలేని మంత్రి ఆపదవికి తగడు.  కొడాలి నాని అక్రమంగా ఇసుక దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు'' అని ఆరోపించారు.

read more  ''మాజీ కేంద్రమంత్రి అశోక గజపతిరాజుకు షాక్... వారసత్వ పదవికి ఎసరు''

''కృష్ణా డెల్టా  ప్రాంతంలో 13 లక్షల ఎకరాల  రైతులు, గోదావరి జిల్లాలో  10 లక్షల ఎకరాలు రైతులున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,  కడప, కర్నూ లు,  అనంతరపురం, విజయగరం, శ్రీకాకుళం జిల్లాలో దాన్యపు రైతుకి  బస్తాకు రూ. 900 కూడా రావటం లేదు.  ఈ పరిస్థితి ఉంటే అసలు మంత్రులకు కనీస మానవత్వం లేదా? చేతకాని మంత్రి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొడాలి నానికి మంత్రి పదవి చేతకాకపోతే గుడివాడ వెళ్లి బస్సులు నడుపుకోవాలి'' అని విమర్శించారు. 

''ధాన్యపు రైతులకు ఇవ్వాల్సిన రూ.1955 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రూ. 211 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 90 కోట్లు, క్రిష్ణా జిల్లా రూ. 255 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. 75 కిలోల బస్తాకు తేమ ఉందని, రంగు సరిగా లేదని కుంటిసాకులతో దళారులు  5 కేజీలు కోత కోస్తున్నారు. జగన్ కమిషన్ కక్కుర్తి వల్ల రూ. 200 కోట్లు చేతులు మారాయి? వాటిపై ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పాలి'' అని నిలదీశారు. 

''దాన్యపు రైతుల్ని దళారులకు అప్పగించటం ద్వారా  రూ. 200 కోట్లు చేతులు మారాయి. ఇందుకు ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? లేక మంత్రిని బర్తరప్ చేస్తారా?  ఇది రూ. 1000 కోట్ల కుంభకోణం. శ్రీకాకుళంలో రూ. 500 కోట్లు బకాయిలు రైతులకి ఇవ్వాలి. ఆ జిల్లా నుంచి వచ్చిన స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ప్రసాదనావు ఏం చేస్తున్నారు?   చంద్రబాబు ను తిట్టడం తప్ప రైతుల కన్నీళ్లు వీరికి పట్టదా?  విజయగరం జిల్లాకు రూ. 380 కోట్లు బకాయిలు ఇవ్వాలి. సీనియర్ మంత్రి బొత్స ఏం చేస్తున్నారు. వీరు ముఖ్యమంత్రిని  రైతుల తరపున ప్రశ్నించలేరా?  వారి  రెండేళ్ల మంత్రి పదవులకు కోసం రైతుల్ని బలిచేస్తారా?'' అని ప్రశ్నించారు.

read more   చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలనే...రెండు సార్లు కుట్ర: బుద్దా వెంకన్న
 
''కరోనా వైరస్  64 దేశాల్లో రూ. 51 లక్షల కోట్లు ఆస్తులు కుప్పకూల్చితే 9 నెలల్లో రాష్ర్టంలో జగన్ వైరస్ రూ. 2 లక్షల కోట్ల ఆస్తుల్ని కుప్పకూల్చింది. వైసీపీ 9 నెలల పాలనలో  పల్లె కన్నీరు పెడుతోంది. ధాన్యం రైతులు ఆత్మహ్యత చేసుకునే పరిస్థితి ఏర్పడింది'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

''రాజధాని ఉద్యమంలో 50 మంది రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవటం సిగ్గుచేటు. పరదాలు అడ్డుకుపెట్టుకుని ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లటం సిగ్గుచేటు. సాక్షి పత్రికల్లో పనిచేసే పనికి మాలిన వారందర్నీ సలహాదారులుగా  నియమించుకుని  ప్రభుత్వ సొమ్ము ను  5 ఏళ్లలో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''75 కిలోలకు రూ. 1361 రావాల్పి ఉంటే రూ. 900 కూడా రావటం లేదు. దాన్యపు రైతుల్ని రూ. 200 కోట్లకు దళారులకు అప్పగించారు.  రైతులు దగ్గర కూడా గన్ రూ. 200 కోట్లు కావాలా? మద్యం కమిషన్లో వచ్చే రూ. 3 వేల కోట్లు జగన్ కి సరిపోవా?  ప్రభుత్వ చేతికానితనం వలన రైతులు ఎకరాకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు నష్టపోయారు.  కానీ రైతుల బాధలు పట్టించుకోకుండా జగన్ ఇంట్లో పబ్జీ గేమ్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. రాష్ర్టంలో యంత్రాంగం ఉందా?  వ్యవసాయశాఖ  చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ మంత్రి, సివిల్ సప్లై మంత్రి  ఏం చేస్తున్నారు?   24 గంటల్లో రైతులకు బకాయిలు విడుదల చేయాలి. లేకపోతే టీడీపీ తరపున రైతులకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి ఆందోనళు చేస్తాం''అని ఉమ హెచ్చరించారు.