విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత నాగేశ్వర రావుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నందిగామలోని అన్న క్యాంటీన్ ల వద్ద వంటావార్పూ కార్యక్రమంలో భాగంగా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు కృష్ణప్రసాద్ లపై విమర్శలు చేశారు. దీనిపై నాగేశ్వరరావు ఘాటుగా స్పందించి ఉమపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

తాజాగా ఈ విమర్శలపై దేవినేని ఉమ స్పందించారు. నందిగామలో వసంత ఫ్యామిలీ హత్యారాజకీయాలు చేశారని... బినామీ ఆస్తుల కోసం పొదిలి రవిని చంపలేదా...   గుండె మీద చేయి వేసి చెప్పాలంటూ నిలదీశారు. 

read more  కరెంట్ తీగలు పట్టుకుని ప్రాణత్యాగానికి సిద్దమే...: దేవినేని ఉమకు మాజీ హోంమంత్రి సవాల్
 
''కుటుంబ సభ్యులను, పిల్లల్ని అందర్నీ తిడితే మంత్రి పదవులు వస్తాయా... గతంలో బాపట్లకు చెందిన మేరీ అనే మహిళ హైదరాబాద్ లోని మీ ఇంటిలో చనిపోయింది వాస్తవం కాదా... అప్పుడు పదవిలో ఉండి కేసును కప్పి పుచ్చింది వాస్తవమా కాదా... బ్రతికుండగానే కాళ్లకు జలగలు పెట్టుకున్నావు మీరు ఎంత పాపం చేశారు. మీ తండ్రి మాట్లాడిన పాపపు  మాటలు నీకు తగులుతాయి. విశాఖపట్నం లో భూములు అమ్ముకోవడం కోసం మూడు రాజధానల ఆటలు ఆడుతున్నారు'' అంటూ వసంత కృష్ణప్రసాద్ పై విరుచుకుపడ్డారు.