90 శాతం ఉద్యోగాలు ఖాళీ... భర్తీ చేపట్టండి: జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

రాష్ట్ర వ్యాప్తంగా  వివిధ ప్రభుత్వం విభాగాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సిపిఐ రాష్ట్ర  కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్, మంత్రి విశ్వరూప్ కు బహిరంగ లేఖ రాశారు.  

CPI state secretary Ramakrishna open letter to CM YS Jagan

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇబ్బందులకు గురవుతున్నారని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. వీటి గురించి ప్రశ్నిస్తూ సీఎం జగన్, మంత్రి విశ్వరూప్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. 

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి రాసిన లేఖలో నిరుద్యోగ యువత ఆవేదనను గురించి ప్రస్తావించారు. '' ఏపిపిఎస్సీ రాత పరీక్ష ద్వారా అర్హత సాధించిన అభ్యర్ధులకు మౌఖిక పరీక్షలు నిర్వహించి విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు చేపట్టాలి. 

రాష్ట్ర వ్యాప్తంగా 14 విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రోఫెసర్ల ఉద్యోగాలకు 2018 ఏప్రిల్ లో రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో 3424 మంది అర్హత సాధించినా  ఇంతవరకు మౌఖిక పరీక్ష జరపలేదు. 

2020 జూన్ నాటికి యూనివర్సిటీలలో 90% బోధనా సిబ్బంది ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. తక్షణమే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టండి'' అంటూ రామకృష్ణ తన లేఖ ద్వారా ముఖ్యమంత్రిని కోరారు.  

read more జగన్ ప్రధాని... విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇక సాంఘిక సంక్షేమ శాఖామంత్రి విశ్వరూప్ కు రాసిన లేఖలో  ''ఎస్సీ కార్పొరేషన్ లో ఫెసిలిటేటర్లుగా పనిచేస్తున్న వారికి వేతన బకాయిలు విడుదల చేసి, ఉద్యోగ భద్రతా కల్పించాలి. 

రాష్ట్రంలో 1300 మంది  ఫెసిలిటేటర్లు ఉన్నారు. వీరికి 2017 నుండి వేతనాలు చెల్లించలేదు. యుసి మొత్తాలను విడుదల చేయలేదు. వీరి జీవనం కాదు భారంగా మారింది. తక్షణమే ఎస్సీ కార్పొరేషన్ లో ఫెసిలిటేటర్లకు వేతన బకాయిలు చెల్లించి, ఉద్యోగ భద్రతా కల్పించేందుకు చర్యలు తీసుకోండి'' అని సిపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. 

read more  రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు: విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios