విశాఖ సెంట్రల్ పార్క్ లో ఫ్లవర్ షో ని ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ విజయ్ సాయి రెడ్డి,మంత్రి అవంతి. వచ్చారు. ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటు టిడిపి చేస్తున్న ఆరోపణలు పై విజయసాయిరెడ్డి  స్పందించారు. 

ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సిబిఐ  విచారణకైనా  ఎఫ్ బి ఐ విచారణకైనా సిద్దమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నాడు. తన వాళ్ళు తన కుటుంబం మాత్రమే బాగుండాలనుకునే వ్యక్తి చంద్రబాబని, కుటీలమైన మనస్సుతత్త్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.  

రాజధాని ప్రకటన త్వరలోనే ఉంటుందని, సీఎం త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారాణి ఆయన చెప్పారు. విశాఖ ఉత్సావాలలోనే కాదు ఇక నిత్యం విశాఖలో పండగ వాతావరణం ఉంటుందని ఆయన రాజధాని విశాఖనే అంటూ చెప్పకనే చెప్పారు. 

Also read; నా పేరుతో అధికారులపై ఒత్తిడి చేస్తే క్రిమినల్ కేసులు: విజయసాయిరెడ్డి

అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి ఆయన గ్యాంగ్ కమీషన్ వ్యాపారం చేసారని,  తెలుగుదేశం పార్టీ అమరావతిలో ఫండింగ్ ఉద్యమాలు నడుపుతోందని, చంద్రబాబు కు ఫండింగ్ ఉద్యమాలు నడపడం అలవాటే అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 

మంత్రి అవంతి మాట్లాడుతూ... కులాల ,మతాలు, ప్రాంతీయ వర్గాల మధ్య చిచ్చుపెట్టి వారిని రెచ్చగొట్టే వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ ను త్వరలోనే బయటపెడతామని అన్నాడు. 

న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని విశాఖ రాజదాని ని చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారని, విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడమని టీడీపీ నాయకులను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడని, ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అని ఆయన అభిప్రాయపడ్డాడు.