Asianet News TeluguAsianet News Telugu

జగన్ రాష్ట్రాన్ని అంధకారం చేశారు: బుద్ద వెంకన్న

 బుద్దా వెంకన్న ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పింహచారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి వేసిన ట్వీట్స్ కి కౌంటర్లు కూడా ఇచ్చారు.  

buddha venkanna controversial comments on ysrcp
Author
Vijayawada, First Published Nov 18, 2019, 5:08 PM IST

ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పింహచారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి వేసిన ట్వీట్స్ కి కౌంటర్లు కూడా ఇచ్చారు.

బుద్దా వెంకన్న వివరణ ఇస్తూ.. "ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న... అఖిలపక్ష సమావేశంలో చివాట్లు తిన్న తరువాత మీకు వచ్చిన ఆక్రోశాన్ని అర్ధం చేసుకోగలం విజయసాయి రెడ్డి గారు. పిపిఏల విషయంలో కేంద్రం మొట్టికాయిలు వేసినా నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ జగన్ గారు రాష్ట్రాన్ని అంధకారం చేసారు. సీఎం ఉంటున్న తాడేపల్లిలోనే కరెంట్ పీకేస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పక్కర్లేదు.  

read also: వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డ గరంగరం, జగన్ వద్దకు పంచాయతీ

దోమలు, ఎలుకల నివారణకు అంతఖర్చా అని వితండవాదన చేసి వెనక్కి తగ్గలేక విషజ్వరాలతో ప్రజల్ని పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు సోలార్ విద్యుత్ కి అంత రేటా అంటూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మీ ప్రభుత్వం తీసుకుంటున్న చెత్త నిర్ణయాలతో దేశంలో ఎక్కడా పెట్టుబడి పెట్టడానికి విద్యుత్ కంపెనీలు ముందుకు రావడం లేదు. జగన్ గారి పేరు చెప్పగానే పెట్టుబడిదారులు  మాయమవుతున్నారు.  మీ పాలన చూసాక ఏకంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది అంటేనే మీది ఎంత గొప్పపాలనో అర్థమవుతుంది.

విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బందిపడకుండా జే ట్యాక్స్ నుండి రక్షణ కల్పిస్తూ కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది. ప్రపంచానికి లెక్కలు చేప్పే జగన్ గారికి, మీకు టెక్నాలజీ అభివృద్ధిచెందే క్రమంలో పునరుత్పాదక విద్యుత్ రేట్లు తగ్గుతాయని తెలియకపోవడం అమాయకత్వమని మాత్రం అనుకోలేం.  అఖిలపక్ష సమావేశంలో చివాట్లు తిన్న తరువాత మీకు వచ్చిన ఆక్రోశాన్ని అర్ధం చేసుకోగలం విజయసాయి రెడ్డి గారు.

పిపిఏల విషయంలో కేంద్రం మొట్టికాయిలు వేసినా నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ జగన్ గారు రాష్ట్రాన్ని అంధకారం చేసారు.    సీఎం ఉంటున్న తాడేపల్లిలోనే కరెంట్ పీకేస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పక్కర్లేదు.  దోమలు, ఎలుకల నివారణకు అంతఖర్చా అని వితండవాదన చేసి వెనక్కి తగ్గలేక విషజ్వరాలతో ప్రజల్ని పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు సోలార్ విద్యుత్ కి అంత రేటా అంటూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు.  మీ ప్రభుత్వం తీసుకుంటున్న చెత్త నిర్ణయాలతో దేశంలో ఎక్కడా పెట్టుబడి పెట్టడానికి విద్యుత్ కంపెనీలు ముందుకు రావడం లేదు.

జగన్ గారి పేరు చెప్పగానే పెట్టుబడిదారులు  మాయమవుతున్నారు.  మీ పాలన చూసాక ఏకంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది అంటేనే మీది ఎంత గొప్పపాలనో అర్థమవుతుంది. విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బందిపడకుండా జే ట్యాక్స్ నుండి రక్షణ కల్పిస్తూ కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది. ప్రపంచానికి లెక్కలు చేప్పే జగన్ గారికి, మీకు టెక్నాలజీ అభివృద్ధిచెందే క్రమంలో పునరుత్పాదక విద్యుత్ రేట్లు తగ్గుతాయని తెలియకపోవడం అమాయకత్వమని మాత్రం అనుకోలేము" అని వివరణ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios