టిడిపి ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చర్యలేమయ్యాయి...: ప్రశ్నించిన బోండా ఉమ

విజయవాడ టిడిపి నేత, మాజీ  ెమ్మెల్యే బోండా ఉమ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ప్రశ్నించారు. ముఖ్యంగా గత టిడిపి హయాంలో జరిగిందంటున్న అవినీతి, అక్రమాలపై చర్యలెందకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

Bonda Uma Shocking Comments On YS Jagan over amaravati  issue

విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబుకి పవన్‌కల్యాణ్‌ దత్తపుత్రుడు అని విమర్శించే స్థాయిగానీ, సత్తాగాని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు లేవని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యాఖ్యానించారు. నోటికి ఎదొస్తే అది వాగుతూ ఈ విమర్శలు చేస్తున్న అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలతో పాటు వైసీపీ నేతలు  జగన్మోహన్‌రెడ్డి పెంపుడుకుక్కలా అని బొండా నిగ్గదీశారు.   

నిజంగా జగన్ పెంపుడుకుక్కలు, పెయిడ్‌ ఆర్టిస్ట్‌ల్లానే వైసీపీ  నేతలు మాట్లాడుతున్నారన్నారని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ని నిజంగానే పాలకొల్లు పవన్ నాయుడని తాము మీసం మీద చెయ్యేసి మరీ సగర్వంగా చెబుతామన్నారు.  ఇష్టమొచ్చినట్లుగా పవన్, చంద్రబాబు గురించి మాట్లాడేవారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని... అలాంటివారికి తాముఎవరనే సందేహముంటే ముందు డీ.ఎన్‌.ఏ పరీక్షలు చేయించుకోవాలని బొండా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదవులకోసం అమ్ముడుపోయారు కాబట్టే రాజధానిని చంపేస్తున్నా వైసీపీ నాయకులు నోరెత్తడం లేదన్నారు. కృష్ణా, గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతరప్రాంతాల్లో గెలిచిన వారెవరైనా సరే భవిష్యత్‌లో బయట తిరగలేరని ఉమా స్పష్టం చేశారు. 

read more  అమరావతిలో ఉద్రిక్తత... మహిళలే వారి టార్గెట్

గతంలో అసెంబ్లీ సాక్షిగా బుగ్గన 600 నుంచి 700 ఎకరాలంటే ఇప్పుడేమో 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన భూముల క్రయవిక్రయాలన్నింటినీ టీడీపీకి అంటగట్టి 4096ఎకరాలుగా లెక్క తేల్చారన్నారు. ఏపీఐఐసీ వ్యవహారంలో గతంలో అంబటి తృటిలో తప్పించుకున్నాడని ఈసారి జగన్‌తోపాటు ఆయనకూడా కృష్ణజన్మస్థానానికి వెళ్లడం తధ్యమన్నారు. 

ల్యాండ్‌ పూలింగ్‌ పాలసీ ప్రకటనచేశాక రైతులు భూములిచ్చారని, వారి కోరిక మేరకే రిజిస్ట్రేషన్లు ఆపలేదన్నారు. ఇంత బహిరంగంగా జరిగితే దీనిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగని అని ఎలా చెబుతారన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రజల అభిప్రాయాల కోసం నారాయణ కమిటీ వేస్తే దాన్ని కూడా తప్పుపడుతున్నారన్నారని... అధికారంలోకి వచ్చిన గత ఏడునెలలనుంచీ గడ్డిపీకుతున్నారా...? అని ఉమ ప్రశ్నించారు.

రైతులకోసం వచ్చిన భువనేశ్వరిపై కూడా పిచ్చికూతలుకూయడం వైసిపి వారికే చెల్లిందన్నారు. మహిళల బాధలు చూసి తన చేతిగాజులిస్తే సిగ్గులేకుండా మాట్లాడతున్నారన్నా రు. అధికారంలోకి వచ్చి ఏడునెలలైనా గత ప్రభుత్వం చేయకపోయినా చేశారంటున్న అక్రమాలపై, అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉమా నిలదీశారు. 

వాస్తవానికి ఏమీ జరగలేదు కాబట్టే ఏడు నెల్లనుంచీ గడ్డి పీకుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25వేల ఎకరాలు కాజేశారని పుస్తకాలేసి తప్పుడు ప్రచారం  చేసిందిచాలక ఇప్పుడు కొత్తగా 4వేల ఎకరాలంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. 

Capital Crisis : భూములిచ్చి రోడ్డున పడ్డామంటూ అమరావతి రైతుల మానవహారం

ఉధృతమవుతున్న అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చడానికే పాతపాటను మళ్లీ పాడుతున్నారన్నారు. గ్రాఫిక్స్‌లో తెలుగుదేశం నేతల ఫొటోలు చూపినంత మాత్రాన, వైసీపీ నేతల బాగోతం నిజమైపోదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పిడివాదాన్ని, మొండితనాన్ని వదిలి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలనచేయాలన్నారు. ఎవరు జైలుకెళ్తారో,  ఎవరు బయటుంటారో మున్ముందు సీబీఐ విచారణలో తేలుతుందన్నారు. 

చంద్రబాబు, పవన్‌ లను అడ్డుకున్న పాలకులు ఉద్యమం ముసుగులో ఎంతకైనా తెగిస్తారన్నారు.  రైతుల్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలు అడ్డేస్తామని టిడిపి నేత బోండా ఉమా స్పష్టం చేశారు.    

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios