అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటే రైతులు చేపట్టిన ఉద్యమం ఉదృతమయ్యింది.  శుక్రవారం సకల జనుల సమ్మెను ప్రారంభించిన రాజధాని ప్రజలు  స్వచ్చందంగా తమ కార్యకలాపాలకు దూరంగా వుండి భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. వీరి నిరసనలు... పోలీసులు భారీ బందోబస్తులతో అమరావతి ప్రాంతమైంతా ఉద్రిక్తంగా మారింది. 

ఈ క్రమంలో మందడం గ్రామంలో నిరసన చేపట్టిన మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న  మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అకారణంగా తమను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు, గ్రామస్తులు  నిరసనను మరింత ఉదృతం చేశారు. 

మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నించగా గ్రామస్తులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మహిళలను బస్సులో తరలిస్తుండగా అడ్డుగా నిలిచి ముందుకు కదలనివ్వలేదు. దీంతో చేసేదేమిలేక పోలీసులే వెనక్కితగ్గి బస్సులోని మహిళలందరిని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. 

read more  మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

స్థానిక పోలీసులు వ్యవహార శైలిని ఖండిస్తూ నినాదాలు చేశారు. పోలీసుల ప్రవర్తన దారుణంగా వుందంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. 

రాజధానిని  అమరావతిలోనే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు విచారణకు రావాలని  రైతులకు చిలకలూరిపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుమారు 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వెలగపూడి, మల్కాపురం గ్రామాలకు చెందిన రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో గోడలపై కొన్ని పోస్టర్లను పోలీసులు అంటించారు.

 ఆందోళన చేస్తున్న వారిపై ఐపీసీ 307, 341, 324, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులపై విచారణకు హాజరుకావాలని చిలకలూరిపేట పోలీసులు నోటీసులు అందించారు. నిరసన కార్యక్రమాలు  చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

read more  సకలజనుల సమ్మె : గులాబీలిచ్చి మద్దతు కోరిన రాజధాని రైతులు

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే రాజధానిని తరలిపోతోందనే ఆందోళనతో ఉన్న రైతులకు తాజాగా పోలీసుల కేసులు కూడ తోడయ్యాయి. దీంతో రైతులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.

 రాజధాని తరలింపు విషయమై స్పష్టత ఇవ్వాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.  శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై హాత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ్టి నుండి రైతులు సకల జనుల సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో భాగంగా స్థానికులు  పోలీసులకు పువ్వులు ఇచ్చి తమ ఉద్యమానికి సహకరించాలని కోరుతున్నారు.