విజయవాడ: జాతకం, జ్యోతిష్యం వున్న నమ్మకంతో ఓ యువతి నిలువునా మోసపోయింది. తన జాతకాన్ని మారుస్తానని చెప్పిన ఓ జ్యోతిష్కుడి మాయమాటలు నమ్మి అతడికి భారీగా డబ్బులు ముట్టజెప్పింది. ఈ ఘరానామోసం విజయవాడలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...నగరానికి చెందిన యువతి  ప్రియాంక జాతకాలను విపరీతంగా నమ్మేది. ఈ మధ్య కాలంలో ఏ పని చేసినా కలిరావడం లేదంటూ ఆమె సనత్ చంద్ర అనే జ్యోతిష్కుడిని ఆశ్రయించింది. ఆమె అమాయత్వాన్ని అదునుగా తీసుకున్న అతడు జాతక దోషాలు తొలగించడానికి పూజలు చేస్తానని...అయితే అందుకు భారీమొత్తంలో ఖర్చవుందని తెలిపారు. 

అంతేకాకుండా ఆమెకు పెళ్లి దోషం కూడా వుందంటూ భయపెట్టాడు. వీటన్నింటికి  పరిష్కారంగా పూజలు నిర్వహిస్తానంటూ ఏకంగా లక్ష రూపాయలు వసూలుచేశాడు. ఆ తర్వాత ఏవో కొన్ని పూజలు చేసి ఇకపై ఎలాంటి సమస్యలు వుండవని చెప్పి  పంపించేశాడు. 

read more బ్యాంక్ ఉద్యోగమే పెట్టుబడి... యువతుల జీవితాలతో ఆడుకుంటున్న నిత్యపెళ్లికొడుకు జైలుపాలు

అయితే ఈ పూజల తర్వాత కూడా ప్రియాంక జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేవు. దీంతో పూజల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని... తన డబ్బులు తిరిగివ్వమని యువతి సదరు జ్యోతిష్కున్ని కోరింది. దీంతో అప్పటివరకు ఆమెపట్ల మర్యాదగా వ్యవహరించిన సనత్ చంద్ర ఒక్కసారిగా బూతుపురణాన్ని అందుకున్నారు. మరోసారి ఇలా డబ్బులు కావాలని తన వద్దకు వచ్చినా... ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పినా చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.

దీంతో భయపడిపోయిన యువతి అక్కడి నుండి నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు వివరించి లిఖితపూర్వకంగా పిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతిష్కుడు సనత్ చంద్ర ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇలాంటి నమ్మకాలతో మోసపోవ్వద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.