మీసేవ నిర్వహకుల ఆందోళన ఉదృతం...నివరధిక సమ్మెకు పిలుపు
రేపటి నుండి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వున్న మీసేవా కేంద్రాలు మూతపడనున్నాయి. శుక్రవారం(రేపటి) నుండి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు మీసేవ కేంద్రాల నిర్వహకులు ప్రకటించారు.
అమరావతి: కొన్నేళ్లుగా రెవెన్యూ విభాగంతో కలిసి పనిచేస్తున్న తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకురావాలని గతకొంతకాలంగా మీసేవ కేంద్రాల నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ డిమాండ్లను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో ఉద్యమబాట పట్టాలని నిర్ణయించినట్లు...శుక్రవారం(రేపటి) నుండి నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం ప్రకటించింది.
ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ''మనం ప్రభుత్వానికి ఇచ్చిన వినతులపైన, మననుండి స్వీకరించిన ప్రతిపాదనలపైన, మన మనుగడ గురించి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత రాకపోవడం మరియు తాజాగా ఏర్పడిన పరిణామాల వల్ల మనం సమ్మెలోకి వెళ్లడం అనివార్యంగా మారింది.
read more కనెక్ట్ టు ఆంధ్రా సక్సెస్... చేయూతకు కార్పోరేట్ సంస్థల ఆసక్తి
రాష్ట్ర సంఘం అన్ని జిల్లాల నాయకులతో సంప్రదించిన మీదట మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిర్వాహకుల భావోద్వేగాలను అనుసరించి 20 వ తేది నుండి అనగా శుక్రవారం నుండి సమ్మె చేయుటకు నిర్ణయించి సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది.
నిర్వాహకులందరూ ఐకమత్యంతో సమ్మెలో పాల్గొని మన కోర్కెలను సాధించుకునేందుకు రాష్ట్ర సంఘానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడమైనది'' అంటూ రాష్ట్ర
మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం(ఆంధ్రప్రదేశ్.రి.నెం.74/2012) తన ప్రకటనలో తెలిపింది.