విజయవాడ: ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వపధకాలు నిలుపుదల చేయాలని గతంలోనే ప్రభుత్వానికి చెప్పామని ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్ కమీషనర్ రమేష్ కుమార్ తెలిపారు. రివ్యూలు, సమావేశాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తాయని... నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ఇటీవల ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్ల ఎప్పటిలాగే తమ సేవలు ప్రజలకి అందిచవచ్చు.... కానీ ఏదైనా పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినా,  ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వున్నా దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు అక్కర్లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. 

read more  టిడిపి నేతలపై దాడిచేసింది కిశోర్... చేయించింది మాత్రం ఆ ఎమ్మెల్యేనే...: అచ్చెన్నాయుడు

జిల్లాలలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సీనియర్ అధికారులను నియమించామని వెల్లడించారు. బీజేపి పార్టి అభ్యర్ది నామినేషన్స్ విషయంలో జరిగిన దాడిపై పోలీసులు ఐఫ్ఐఆర్ కూడా నమోదు చేసి అరెస్టులు కూడా చేశారని... ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా చూస్తారని పోలీసులపై పూర్తి నమ్మకం ఉందన్నారు.  నామినేషన్ వేయడాన్ని అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. 

''ఇవాళ(బుధవారం) ఉదయమే డీజీపీతో మాట్లాడాను. ఎక్కడకూడా గొడవలు జరగకుండా చూస్తున్నామని డీజీపీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. వాటిపైనా దృష్టి పెట్టాం. జిల్లాలవారిగా నమోదు అవుతున్న కేసులు వివరాలు తెలుసుకుంటున్నాం'' అని తెలిపారు.

''ప్రభుత్వ భవనాలకు ఉన్న రంగులు తొలగించాలని హైకోర్ట్ చెప్పింది. నిర్ణీత గడువులోపే రంగులు తొలగించేలా చర్యలు తీసుకోవాలి. ఈనెల 15 న మొదటివిడుత పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తాం. అభ్యర్దుల సర్టిఫికెట్స్ విషయంలో నిర్లక్ష్యం వద్దు. అధికారుల ఫాస్ట్ ట్రాక్ లో అందిచాలి'' అని అధికారులను ఆదేశించారు.

read more  బోండా ఉమ, బుద్దాలపై దాడిచేసింది ఆ యువకులే...: కేఈ కృష్ణమూర్తి

''ప్రభుత్వం ఉగాది రోజున చేపట్టాలని భావిస్తున్న ఇళ్లపట్టాల పంపిణి పథకం ఎన్నికల నియామావళికి విరుద్దం. నిఘా యాప్ పంచాయితీరాజ్ శాఖ ప్రవేశపెట్టినా ఆ యాప్ వల్ల ఉపయోగం ఉంది... కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం'' అని ఎన్నికల కమీషనర్ వివరించారు.