MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • విజయవాడలో కారు ధరకే 2BHK ప్లాట్స్... భవిష్యత్ లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం

విజయవాడలో కారు ధరకే 2BHK ప్లాట్స్... భవిష్యత్ లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాబట్టి భవిష్యత్ లో ఈ ప్రాంతమే కాదు దగ్గర్లోని విజయవాడలో కూడా ఊహించని డెవలప్మెంట్ చూడవచ్చు. మంచి లాభాల కోసం ఈ నగర శివార్లలో ఇప్పుడే ఇళ్లు, స్థలాలు కొనిపెట్టుకోవడం ఉత్తమం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 25 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయవాడ రియల్ బూమ్..
Image Credit : Gemini AI

విజయవాడ రియల్ బూమ్..

Vijayawada Real Estate : ఉద్యోగాలు, ఉపాధికోసం సొంతూళ్లను వదిలి పెద్దపెద్ద పట్టణాలు, నగరాలకు చాలామంది వలస వెళుతుంటారు. వీళ్లు ఇంటి అద్దెలు కట్టలేక ఎప్పుడెప్పుడు సొంతిళ్లు కొందామా అని కలలు కంటుంటారు. కానీ నగరాల్లో రియల్ బూమ్ కారణంగా ఇల్లు కొనాలంటే లక్షలు, కోట్లు కావాలి..  ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన నగరం విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విజయవాడ సొంతింటి కల నిజం చేసుకోవాలా..?
Image Credit : Gemini AI

విజయవాడ సొంతింటి కల నిజం చేసుకోవాలా..?

అయితే విజయవాడలో బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్డు, గుణదల, పటమట వంటి ఖరీదైన ప్రాంతాలే కాదు మధ్య తరగతి ప్రజలు కూడా జీవించేందుకు అనువైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నగరంలో కలుస్తున్న ప్రాంతాలు, గ్రామాల్లో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. భవిష్యత్ లో బాగా అభివృద్ధి చెందే అవకాశాలున్న ప్రాంతాల్లో ఇంటిస్థలాలు, ఇళ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

36
విజయవాడలో ఇల్లు.. ఇదే మంచి సమయం
Image Credit : Gemini AI

విజయవాడలో ఇల్లు.. ఇదే మంచి సమయం

విజయవాడకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా గుర్తింపు ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ మంచి ఊపుమీద ఉంటుంది. రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యం కలిగివుండటంతో విజయవాడ స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఐటీ కంపెనీలు కూడా విజయవాడకు వస్తున్నాయి... దీంతో రియల్ ఎస్టేట్ మరింత జోరందుకుంది. కాబట్టి మంచి ఇల్లు కట్టుకుని విజయవాడలో స్థిరపడాలనుకుంటే ఇది మంచి సమయం. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుందని అనుకుని భూమిపై ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకునేవారికి కూడా విజయవాడ పర్పెక్ట్ ఆప్షన్.

46
తక్కువధరకు అపార్ట్ మెంట్ ప్లాట్స్
Image Credit : Getty

తక్కువధరకు అపార్ట్ మెంట్ ప్లాట్స్

విజయవాడలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఇళ్ల ధరలు ఉన్నాయి. ఇక్కడ అపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగింది... కేవలం 30-40 లక్షల లోపే 1BHK, 2BHK ప్లాట్లు లభిస్తున్నాయి. ఇక ఇండిపెండెంట్ ఇళ్లు కూడా బడ్జెట్ ధరల్లోనే లభిస్తున్నాయి. రూ.50 లక్షలకు కాస్త అటుఇటుగా ఇల్లు లభించే ప్రాంతాలు విజయవాడ నగరంలోనూ, శివార్లలోనూ అనేకం ఉన్నాయి. 

56
విజయవాడ శివారులో ఇన్వెస్ట్ చేయండి..
Image Credit : Gemini AI

విజయవాడ శివారులో ఇన్వెస్ట్ చేయండి..

ముఖ్యంగా గన్నవరంతో పాటు నున్న, కొత్తూరు తాడేపల్లి, గొల్లపూడి, మంగళగిరి, కంచికచర్ల ప్రాంతాల్లో అనేక లేఅవుట్స్ వెలుస్తున్నాయి. ఇక్కడ తక్కువ ధరలోనే చిన్నపాటి ఇండిపెండెంట్ ఇళ్లు లభిస్తున్నాయి. అలాగే పోరంకి, కానూరు దాటిన తర్వాత వచ్చే పెనమలూరు పరిసరాల్లో కూడా కొంచెం లోపలికి వెళితే బడ్జెట్ ధరల్లో ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉండటంతో, పెట్టుబడి దృష్ట్యా కూడా ఇవి ఉత్తమమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి.

66
విజయవాడ శివారు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఖాయం..
Image Credit : swagruha.telangana.gov.in

విజయవాడ శివారు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఖాయం..

విజయవాడ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలు భారతీ నగర్, సిద్ధార్థ నగర్, మొగల్రాజపురం వంటిచోట్ల విలాసవంతమైన ఇళ్లు కోట్లలో పలుకుతున్నాయి. ఈ ప్రాంతాలు నగర నడిబొడ్డున ఉండి, అన్ని రకాల కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్‌కు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. కానీ అమరావతి ఎఫెక్ట్ తో భవిష్యత్ లో విజయవాడ జెట్ స్పీడ్ తో విస్తరించే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడే శివారుప్రాంతాల్లో ఇళ్ళు లేదా ఇంటిస్థలాలు కొనుగోలు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఇప్పుడు లక్షలకు కొంటే భవిష్యత్ లో కోట్లు కావచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల సూచ‌న‌లు తీసుకోవ‌డ‌మే మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
Recommended image2
Now Playing
దమ్ముంటే దేవాన్ష్ పై ప్రమాణం చేయు లోకేష్ | Kethireddy Sensational Comments On Nara Lokesh
Recommended image3
Weather Update : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Related Stories
Recommended image1
CJ Roy Net Worth : రియల్ ఎస్టేట్ టైకూన్ సిజె రాయ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
Recommended image2
Now Playing
YS Sharmila Pressmeet: అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా షర్మిల సంచలన కామెంట్స్| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved