గాంధీ సంకల్ప యాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కన్నా లక్ష్మీనారాయణ
గాంధీ సంకల్ప యాత్ర ను రాష్ట్రం లో ఒక దీక్ష లాగా నిర్వహించామని అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
గాంధీ సంకల్ప యాత్ర ను రాష్ట్రం లో ఒక దీక్ష లాగా నిర్వహించామని అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయవాడలోని ఓ హోటల్ లో జరిగిన గాంధీ సంకల్పయాత్ర పుస్తకా విష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఆంగ్ల మాధ్యమం వచ్చాక దేశం కోసం త్యాగం చేసిన నాయకులను మర్చిపోతున్నామని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ గాంధీ స్ఫూర్తి ఈ తరానికి చైతన్యం కలిగించేలా కార్యక్రమం చేయాలని సూచించారని ఆయన గుర్తుచేశారు.
Also Read:వైసీపీ ఎమ్మెల్యే రజనీపై అభ్యంతర పోస్టులు, ఇద్దరి అరెస్ట్
సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ఒక వైపు....అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి మరోవైపు జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందంగా వుందని కన్నా పేర్కొన్నారు.
ఎంపీ జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని కొంతమంది రాజకీయాలకి వాడుకున్నారు కానీ ఆయన ఆశయాలను వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లేలా మోదీ గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు.
ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ దగుల్బాజీ రాజకీయాలు చేస్తోందని జీవీఎల్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అనే కంటే రాహుల్ జిన్నా, సోనియా జిన్నా అనే పేరు వారికి సూట్ అవుతుందని నరసింహారావు మండిపడ్డారు. మహాత్మా గాంధీజీ ఆశయాలు దేశానికి చాలా అవసరమని జీవీఎల్ సూచించారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని దేశాన్ని సోనియాగాంధీ కుటుంబం దేశాన్ని దోసేసిందని ఆరోపించారు. గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ పాటించలేదని.. బీజేపీ వినూత్నమైన పార్టీ.. దేశం కోసం ప్రాణాలు అర్పించే పార్టీ అని సత్యకుమార్ తేల్చిచెప్పారు.
మోదీనే గాంధీజీ నిజమైన వారసుడని.. ఆయన ఆశయాలు నెరవేర్చేది మోడీనే అన్నారు. గాంధీ ఆశయ సాధనకు 4 లక్షల కిలోమీటర్ల పాదయాత్ర బీజేపీ నాయకులు చేశారని సత్యకుమార్ వెల్లడించారు.
Also Read:చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... ముప్పేటదాడికి కేసులు సిద్ధం
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయలు కాంగ్రెస్ కె పరిమితం కాలేదని.. కుటుంబ పాలనను కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చేసిందని మండిపడ్డారు.
ఇప్పుడు వైసీపీ, ఎన్సీపీ, టీడీపీ లు కాంగ్రెస్ దారి లోనే కుటుంబ పాలన చేస్తున్నాయని సోము ధ్వజమెత్తారు. గాంధీ పేరుతో వ్యవస్థను ఈ దేశంలో కాంగ్రెస్ నాశనం చేసిందని ఆరోపించారు. కుటుంబాలు లేని, కుటుంబాలు వదిలేసిన పాలన బీజేపీదేనని వీర్రాజు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా యాత్రలో ముఖ్య భూమిక పోషించిన కన్వీనర్లకు కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పురస్కారాల ప్రధానం చేశారు.