హుజురాబాద్ లో హీటెక్కిన రాజకీయాలు...ఓవైపు షర్మిల దీక్ష, మరోవైపు దళితుల సంబరాలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ఇళ్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని దళిత కాలనీలలో కోలాహలం నెలకొంది. సోమవారం హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రూ.500 కోట్లు విడుదల చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సిరిసేడు గ్రామంలోని దళిత కాలనీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు దళితులు. ఈ సంబరాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డప్పులు వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ, గులాబీ రంగు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. తమకోసం దళిత బంధు వంటి పథకాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ఫోటోను దళిత కాలనీలోని ప్రతి ఇంట్లోపెట్టుకుంటామని మహిళలు తెలిపారు. అయితే ఇదే సిరిసేడు గ్రామంలో ఇవాళ వైఎస్ షర్మల నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తోంది. 
 
First Published Aug 10, 2021, 3:00 PM IST | Last Updated Aug 10, 2021, 3:00 PM IST