యాదగిరిగుట్టలో వర్ష బీభత్సం... ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డు ధ్వంసం

 యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి వేలకోట్లతో అభివృద్ది చేసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇటీవలే ప్రారంభమయ్యింది.

First Published May 4, 2022, 3:34 PM IST | Last Updated May 4, 2022, 3:34 PM IST

 యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి వేలకోట్లతో అభివృద్ది చేసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇటీవలే ప్రారంభమయ్యింది. అయితే ఒక్క వానతో ఆలయ అభివృద్దిలో భాగంగా చేపట్టిన కొన్ని పనులు ఎంత నాసిరకంగా జరిగాయో బయటపడింది. ఇవాళ తెల్లవారుజామున యాదిగిరిగుట్టలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆలయ కొత్త ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డు కోతకు గురయ్యి ఎక్కడికక్కడ కుంగిపోయింది.  ఇక వర్షం దాటికి ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ వద్దకు భారీగా నీరుచేరి రింగ్ రోడ్ చెరువును తలపిస్తోంది. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు బురదమయం కావడంతో అందులో బస్సు కూరుకుపోయింది. ఇక భక్తులు ఎండవేడిమి నుండి సేదతీరేందుకు కొండపై ఏర్పాటుచేసిన చలువ పందిళ్ళు ఈదురుగాలులకు కుప్పకూలాయి. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలోకి  వర్షపు నీరు చేరింది.