గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర, రాష్ట్రాల వివాదం... సూర్యాపేటలో టీఆర్ఎస్ నాయకుల ఆందోళన

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపామంటే... అసలు అలాంటి ప్రతిపాదనేది తమకు అందలేదని కేంద్రం అంటోంది. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య అగ్గి రాజేసుకుంది. ఈ క్రమంలో కేంద్రం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనపై పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు ఆడుతోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజన నాయకులు ఆందోళన చేపట్టారు.  ప్లకార్డులు, నల్లజెండాలతో ప్రదర్శన చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసారు.గిరిజన రిజర్వేషన్ల బిల్లు తమకు చేరలేదనడం గిరిజనులను కించ పరచడమేని... పార్లమెంట్ లో ఈ ప్రకటన చేసిన కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ ను బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేసారు.

First Published Mar 23, 2022, 3:29 PM IST | Last Updated Mar 23, 2022, 3:29 PM IST