JusticeForPriyankaReddy : నిందితులను మాకు అప్పగించండి...మేము చూసుకుంటాం..
వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసు నేపథ్యంలో షాద్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసు నేపథ్యంలో షాద్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి లేదా తమకు అప్పగించాలంటూ ఆందోళన కారులు స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. స్టేషన్ చుట్టూ ఆందోళనకారులు ఉండటంతో పోలీసులు నిందితులను ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్, సురేందర్ లు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు.