లేడీ టెక్కీ ఆత్మహత్య: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత... (వీడియో)

శంషాబాద్ పైలట్ భార్య లేడీ టెక్కి లావణ్యది ఆత్మహత్య కాదని భర్తే ఉరి వేసి ఉంటాడని లావణ్య తల్లిదండ్రులు అంటున్నారు. 

First Published Jun 27, 2020, 8:54 AM IST | Last Updated Jun 27, 2020, 9:03 AM IST

శంషాబాద్ పైలట్ భార్య లేడీ టెక్కి లావణ్యది ఆత్మహత్య కాదని భర్తే ఉరి వేసి ఉంటాడని లావణ్య తల్లిదండ్రులు అంటున్నారు. ప్రేమించానంటూ ఇంటిచుట్టూ తిరిగి పెళ్లి చేసుకున్నాడని, నిత్యం నరకం చూపించాడని విలపిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రభుత్వం వెంటనే కాల్చి పారేయాలని అంటున్నారు. లావణ్య లహరి అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  భర్త వెంకటేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడని, అతడి పైలట్‌ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని తండ్రి ఈశ్వరయ్య కోరుతున్నాడు.

భర్త దాష్టీకం.. టెక్కీ లావణ్య చివరి మాటల సెల్ఫీ వీడియో...

వీడు మనిషేనా.. టెక్కీపై శాడిస్టు భర్త దాడి (వీడియో)

లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త...