Asianet News TeluguAsianet News Telugu

టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి.. పవన్ కల్యాణ్..


నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు.

నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశాడు.  గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది.  కరోనాకు తోడు ఈ వరదలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయన్నారు. వరదల వల్ల రెండు తెలుసు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని.. తెలంగాణ లో ముఖ్యంగా హైదరాబాద్ లో దీని తాకిడి ఎక్కువగా ఉందని, దీనికి టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడమే కారణమని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే తన వంతుగా తెలంగాణ ప్రభుత్వానికి  కోటి రూపాయలు ప్రకటిస్తున్నానని అన్నారు. జనసైనికులు, అభిమానులు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.