Video : కలెక్టర్ దేవసేనపై ప్రశంసలు కురిపించిన గవర్నర్ తమిళి సై
జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్న పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు.
జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్న పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ రోజు ఉదయం బ్రేక్ పాస్ట్ అనంతరం బాలికల ఆత్మరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినిలకు కళరి పయట్టు శిక్షణ పొందుతున్న గోదావరిఖని ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థుల కళరి పయ్యట్టు (మర్మకళ) ప్రదర్శన తిలకించారు. అనంతరం బసంతనగర్ లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనపనార బ్యాగ్స్ యూనిట్ పెద్దపల్లి లోని సబల యూనిట్ ల పనితీరును పరిశీలించారు. బాలికల అత్మరక్షణకు కళరి పయ్యట్టు విద్య ఏంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.