సిరిసిల్ల: నడిరోడ్డుపై అగ్నిప్రమాదం... గ్రానైట్ లారీలో ఎగిసిపడ్డ మంటలు
సిరిసిల్ల: సాకేంతిక సమస్యతో మంటలు చెలరేగి లారీ దగ్దమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
సిరిసిల్ల: సాకేంతిక సమస్యతో మంటలు చెలరేగి లారీ దగ్దమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా బావుపేట నుండి హైదరాబాద్ కు గ్రానైట్ లోడ్ తో వెళుతున్న లారీలో కొదురుపాక వద్ద సమస్య తలెత్తింది. ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగి లారీమొత్తాన్ని వ్యాపించాయి. అయితే ముందుగానే అప్రమత్తమైన డ్రైవర్ జకీర్ లారీలోంచి కిందకుదూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు.