మావాళ్లు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాం: SLBC వద్ద బాధిత కుటుంబీకులు | Asianet News Telugu
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం కూలి ఎనిమిది రోజులు అవుతోంది. అయితే, సొరంగం లోపల చిక్కుకున్న వారి ఆచూకి ఇంకా తెలియలేదు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం వారి కుటుంబ సభ్యులు బయట పడిగాపులు పడుతున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలని కోరుతున్నారు.