కొండపోచమ్మ సాగర్ కాలువ పరిశీలనలో కాంగ్రెస్ నేతలు..

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గండిపడ్డ కొండపోచమ్మ సాగర్  కాలువను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు.

First Published Jul 1, 2020, 12:19 PM IST | Last Updated Jul 1, 2020, 12:19 PM IST

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గండిపడ్డ కొండపోచమ్మ సాగర్  కాలువను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డిలు మర్కూర్ లో గండ్లు పడ్డ కాలువ, ముంపునకు గురైన వెంకటపూర్ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో  కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద గండి పడిన విషయం తెలిసిందే.