Asianet News TeluguAsianet News Telugu

భూతగాదాలతో కత్తులతో దాడి: ఒకరు మృతి

May 24, 2020, 11:08 AM IST

గత కొంత కాలంగా భూ తగాదాల నేపథ్యంలో ఒక వర్గం పై మరో వర్గం కత్తులతో దాడి చేయడంతో ఐదుగురు తీవ్ర గాయాల పాలైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామనికి చెందిన బక్కశెట్టి గంగారెడ్డి,  ఇరిశెట్టి వెంకన్న కుటుంబాల మధ్య ఆస్తి పంపకాల గొడవలు కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ ఉండగా ఒక రోజు ముందు రాత్రి శనివారం రోజు రాత్రి ఇరువర్గాలు కట్టెలు, కత్తుల తో గొడవకు దిగారు. ఈ గోడవల్లో బక్క శెట్టి గంగారెడ్డి, బక్క శెట్టి సతీష్ లతోపాటు ఇరిశెట్టి వెంకన్న తో భార్య.... కొడుకు రాకేష్ లకు తీవ్ర గాయాలు కావడం తో 108 ద్వారా స్థానికులు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇరిశెట్టి వెంకన్న కొడుకు రాజేష్ పరారీలో ఉన్నట్లు సమాచారం. గంగా రెడ్డి పరిస్థితివిషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి మృతి చెందాడు.