గుండె బాగానే ఉంది, కానీ... : బలగం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి పై నిమ్స్ డైరెక్టర్
తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న బలగం మొగిలయ్యకు మంత్రి హరీశ్ రావు చొరవతో నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.
తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న బలగం మొగిలయ్యకు మంత్రి హరీశ్ రావు చొరవతో నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. వైద్య శాఖా మంత్రి ఆదేశాల మేరకు నిమ్స్ వైద్య బృందం అత్యున్నత వైద్యం అందిస్తున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ తో పాటు, బీపీ, షుగర్ తో మొగిలయ్య బాధపడుతున్నారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుండి నిమ్స్ తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై నిమ్స్ డైరెక్టర్ బీరప్ప స్పందించారు. గుండె బాగానే ఉన్నప్పటికీ, కిడ్నీ, బీపీ సమస్యలతో సహా కంటి చూపు మందగించిందని తెలిపారు.