జార్ఖండ్ సీఎం హేమంత్, మాజీ సీఎం శిబు సోరెన్ తో కేసీఆర్ భేటీ...
రాంచి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు.
రాంచి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు. న్యూడిల్లీ నుండి రాంచీ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా విగ్రహానికి నివాళి అర్పించారు. అక్కడినుండి నేరుగా సీఎం సోరెన్ అధికారిక నివాసానికి వెళ్లారు. కేసీఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్, ఆయన తండ్రి శిబు సోరెన్ తో కూడా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్, తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు కూడా జార్ఖండ్ సీఎంతో భేటీలో పాల్గొన్నారు.