మహా కుంభమేళా: త్రివేణి సంగమంలో అఖిలేష్ యాదవ్ పుణ్యస్నానం | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 27, 2025, 6:50 PM IST

సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గంగమ్మ మమ్మల్ని పిలిచింది, అందుకే మేము వచ్చాం. గంగా, యమునా, సరస్వతి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి స్నానం చేయడం మా అదృష్టం" అని పేర్కొన్నారు. సంగమంలో 11 స్నానాలు చేసిన అఖిలేష్ యాదవ్.. సామరస్యం, శాంతి, సహనంతో ముందుకు సాగాలనే సంకల్పాన్ని ప్రకటించారు. 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభ్ అనేది విశ్వాసానికి, భక్తికి ప్రతీక అని.. సమాజంలో సామరస్యం కొనసాగాలని, ప్రజల సంక్షేమానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరుకున్నారు.