లెబనాన్ లో భారీ పేలుడు.. దడ పుట్టిస్తున్న వీడియోలు.. చూడండి..

లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడు సంభవించింది.

First Published Aug 5, 2020, 12:39 PM IST | Last Updated Aug 5, 2020, 12:39 PM IST

లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 70 నుండి 100 మంది దాకా చనిపోయినట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అంతే కాక నాలుగు వేలకుపైగా మందికి పైగా క్షతగాత్రులయ్యారని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.  బీరుట్ లోని ఓ పోర్టులో ఈ పేలుడు జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి పోర్ట్ లోని ఓ గోడౌన్ లో ఆరేళ్లుగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడుకు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోంది. ఘటనలో చాలా భవనాలు ధ్వంసం కాగా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. పేలుడు శబ్దం 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వినిపించిందంటే పేలుడు తీవ్రత ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు.