KCR meets stalin: బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ కావడంతో ఫెడరల్ ఫ్రంట్ మీద మరోసారి చర్చ జరుగుతోంది. 

First Published Dec 17, 2021, 11:07 AM IST | Last Updated Dec 17, 2021, 11:07 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ కావడంతో ఫెడరల్ ఫ్రంట్ మీద మరోసారి చర్చ జరుగుతోంది. బిజెపికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగానే కేసీఆర్ Stalinను కలిసినట్లు చెబుతున్నారు. స్టాలిన్ బిజెపికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఓ వైపు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి వ్యతిరేక రాజకీయాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో KCR పావులు కదపడం ప్రారంభించారు. మమతా బెనర్జీతో ముందుకు సాగుతారా, తనదే అయిన కూటమిని ఏర్పాటు చేస్తారా, కేసీఆర్ ఆలోచన ఎలా ఉందనేది తేలాల్సి ఉంది.